జగన్ త్వరలో జైలుకు వెళ్ళటం ఖాయం.. షాకింగ్ విషయం చెప్పిన ఏపీ మంత్రి!
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి సత్య కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పదే పదే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని వాటికి రుజువులు చూపించగలవా జగన్ అంటూ ప్రశ్నించారు. వైసిపి హయాంలో ఇచ్చిన హామీలను ఎన్నిటిని అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.
రైతు భరోసా ఎంతిస్తామని, ఎంత ఇచ్చారు?: ప్రశ్నించిన మంత్రి సత్య కుమార్
గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా ఎంత ఇస్తామని చెప్పి ఎంత ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు మద్దతుగా 20వేల రూపాయలు అందిస్తుందని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ అయినా తెచ్చావా జగన్ అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం 2.5 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థల పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఏపీకి భారీగా పెట్టుబడులు
ప్రైవేట్ పరంగా ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని, ఏపీ పారిశ్రామికంగా ప్రగతి బాటలో పయనిస్తుందని మంత్రి సత్య కుమార్ తెలిపారు. అవినీతి చేసిన వారిని అరెస్టు చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్లే క్రమంలో జగన్ అలజడులు సృష్టిస్తున్నారని మంత్రి సత్య కుమార్ మండిపడ్డారు. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.
చర్చకు రావాలని జగన్ కు మంత్రి పిలుపు
గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవస్థలను ఇష్టారాజ్యంగా వాడుకున్నారని, ముఖ్యంగా పోలీసులను ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడానికి వాడుకున్నారని ఆయన ఆరోపించారు. నేను మంత్రిగా చర్చకు రావాలని జగన్ ను పిలుస్తున్నానని చెప్పిన మంత్రి అసెంబ్లీకి వచ్చి చర్చించండి అని దండం పెట్టి అడుగుతున్నానన్నారు.
రప్ప రప్ప అనే భాషలు సభలో ఉండవు.. వచ్చి ప్రశ్నించాలి
అసెంబ్లీలో ఐదేళ్ల పాటు లా ఉండదని, మీ వాడుక భాష రప్ప రప్ప అనే భాషలు కూడా అసలే ఉండవని నిర్భయంగా సభకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా, అన్ని రంగాలకు సహకరిస్తామని అన్నారు. అంతేకాదు అసలు ఏపీ లిక్కర్ కేసుతో సంబంధం లేదు అని చెప్పిన వారి వద్దనే నోట్ల కట్టలు కూడా దొరుకుతున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications