Vizag : వైజాగ్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం-పెరిగిన క్రైమ్ రేట్ తో ..!
ఏపీలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో కీలకమైన విశాఖ నగరంలో ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నా.. మరోవైపు పెరిగిన నేరాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా స్ధానికంగా సాక్షాత్తు సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కొందరు పాత నేరస్తులు కిడ్నాప్ చేసి దారుణంగా వేధించడం, ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత కూడా కిడ్నాప్ ల పర్వం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తులో ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖలో నేరాల అదుపు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైజాగ్ నగరాన్ని టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తీసుకొస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సిటీలో జరుగుతున్న నేరాలను స్ధానికంగా ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై టాస్క్ ఫోర్స్ ఈ నేరాల విచారణ చేపట్టబోతోంది.

ప్రస్తుతం వైజాగ్ సిటీ పరిధిలో ఉన్న అన్ని కమిషనరేట్లను టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తెస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరంలో ఎక్కడ నేరాలు జరిగినా వాటిపై టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టేందుకు వీలు కలిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక తాజాగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది స్ధానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్. ఎంపీ కుటుంబానికే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్ధితి ఏంటనే చర్చకు ఇది కారణమైంది.
అలాగే మరో రియల్టర్ కుటుంబం కూడా కిడ్నాప్ కు గురైంది. శ్రీనివాస్ అనే రియల్టర్ తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు. పాత లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కూడా కలకలం రేపింది. దీంతో ఈ ఘటన కూడా పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో ప్రభుత్వం ఇవాళ నగర పోలీసు వ్యవహారాల్ని టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications