రైల్వే మంత్రికి జగన్ సర్కార్ కౌంటర్-వైజాగ్ రైల్వే జోన్ భూసేకరణపై క్లారిటీ..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదే సమయంలో కేంద్ర బడ్జెట్ రావడం, అందులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ఓ ప్రకటన వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. కీలకమైన ఎన్నికల వేళ రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని తాకాయి. దీంతో ఇవాళ వాటిపై అధికారులతో క్లారిటీ ఇప్పించింది. వైజాగ్ రైల్వే జోన్ కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడంపై రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలపై సర్కార్ స్పందించింది.

నిన్న కేంద్ర బడ్జెట్ తర్వాత రైల్వే కేటాయింపులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఆ సమయంలో మీడియా వైజాగ్ రైల్వే జోన్ పనుల జాప్యంపై ఆయన్ను ప్రశ్నించింది. దీంతో ఆయన ఫైర్ అయ్యారు. ఆ విషయం తనను ఎందుకు అడుగుతారని, ఏపీ ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం వైజాగ్ రైల్వే జోన్ కు కావాల్సిన భూమిని సేకరించకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరోక్షంగా చెప్పేశారు.

jagan regime counter to railway minister ashwini vaishnaws remarks on vizag railway zone land

దీనిపై ఇవాళ అధికారులు స్పందించారు. వైజాగ్ రైల్వే జోన్ కోసం విశాఖ జిల్లా ముదసర్లోవలో భూమిని కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. సర్వే నంబర్ 26లో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్ కోసం ఇచ్చినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. రైల్వేతో ఏపీ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ భూమిని కేటాయించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం వారు ఎంత అడిగారో అంతే ఇచ్చినట్లు తెలిపారు. దీంతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిన్న చేసిన ప్రకటన తప్పని తేలిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+