ఇసుక రవాణా టెండర్లు రద్దు చేస్తూ జగన్ సంచలన నిర్ణయం .. రీజన్ ఇదే

సెప్టెంబర్ 5 నుండి ఏపీలో ఇసుక రవాణా చెయ్యాలని నిర్ణయించిన జగన్ సర్కార్ కొత్త ఇసుక పాలసీ ని తీసుకొచ్చింది. అయితే కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది గత అర్ధరాత్రి ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఏపీ గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది . ఇసుక రీచ్ నుండి కొనుగోలు దారుల వద్దకు తరలించడానికి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇటీవల టెండర్లను పిలిచి వాటిలో కొన్నింటిని ఆమోదించింది.

అతి తక్కువ కోట్ చేయటం వల్ల ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం

అతి తక్కువ కోట్ చేయటం వల్ల ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం

అయితే ఈ టెండర్లలో కొందరు కాంట్రాక్టర్లు అతి తక్కువగా కిలోమీటర్ కు రూ 1. 90పైసలు గా చాలీచాలని కోట్ చేసి టెండర్లను దక్కించుకున్నారు. అయితే అతి తక్కువ ధరకు కోట్ చేశారనే ఉద్దేశంతో ఇసుక రవాణా ఇసుక రావాణా టెండర్లను జగన్ సర్కార్ రద్దు చేసింది. గనుల శాఖ శుక్రవారం అర్థరాత్రి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.మొత్తం 8 జిల్లాలకు టెండర్లు ఖరారు చేయగా, మిగిలిన 5 జిల్లాలకు తాజాగా టెండర్లు పిలిచారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఒకే రవాణా కాంట్రాక్టర్ ఉంటే వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలుంటుందని భావించి , ముందు ఆలోచనతో ఖరారైన ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ గనుల శాఖ కార్యదర్శి శుక్రవారం రాత్రి ఏపీఎండీసీ అధికారులకు ఆదేశాలు పంపారు.

జీపీఎస్ ఉన్న వాహనదారులు ఇసుక రవాణాకు అర్జీ పెట్టుకుంటే ఇచ్చే ఆలోచనలో సర్కార్

జీపీఎస్ ఉన్న వాహనదారులు ఇసుక రవాణాకు అర్జీ పెట్టుకుంటే ఇచ్చే ఆలోచనలో సర్కార్

దీంతో ఇప్పటి వరకు ట్రక్కులు, ట్రాక్టర్లలో ఇసుక తరలించటానికి పిలిచిన టెండర్లు మొత్తం రద్దు అయ్యాయి. మరోవైపు జిల్లాల్లో జీపీఎస్‌ ఉన్న లారీలు, ట్రాక్టర్ల యజమానుల ఎవరైనా గనుల శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుంటే వారందరికీ ఇసుక తరలించే అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఇసుక రవాణా చార్జీలను కి.మీ.కు రూ.4.90 వంతున ధర ఖరారు చేసినట్లు తెలిసింది.. విజిలెన్స్ అధికారులు, డిజిపి ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసింది. జిపిఎస్ ఉన్న లారీలు ట్రాక్టర్లు యజమానులు ఎవరైనా సరే ఇసుక రవాణాకు అర్జీ పెట్టుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని సెప్టెంబర్ 5 నుండి అమలు చేయనున్న నేపథ్యంలో, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా, ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రభుత్వం ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసినట్లుగా తెలుస్తుంది.

ఇసుక కోసం ప్రతిపక్షాల ఆందోళనలు .. కొత్త ఇసుక విధానం కోసం అధికార పక్షం కసరత్తులు

ఇసుక కోసం ప్రతిపక్షాల ఆందోళనలు .. కొత్త ఇసుక విధానం కోసం అధికార పక్షం కసరత్తులు

ఇక టీడీపీ ఏపీ లో నెలకొని సమస్య నేపద్యంలో నిన్న రాష్ట్రవ్యాప్త ఆందోళన చేసింది. ప్రభుత్వ ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిందని ఆరోపించింది. నిర్మాణ రంగ కార్మికులకు ఈ మూడు నెలల కాలంలో జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తుంటే, అణచి వేయడానికి ఏపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని టిడిపి మండిపడింది. మొత్తం మీద ఇసుక విషయంలో అటు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుంటే, కొత్త ఇసుక విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+