అరుణ్ జైట్లీ వార్షిక బడ్డెట్: సోనియా సహా ఎవరేమన్నారు?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోకసభలో ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అధికార బిజెపి నాయకులు, మంత్రులు బడ్జెట్‌ను ప్రశంసిస్తుండగా, ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. బడ్జెట్‌పై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రతిస్పందించారు. పూర్తిగా అమలు చేసుకోదగిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఎవరు ఏమన్నారో చూద్దాం

నరేంద్ర మోడీ, ప్రధాని

ఇది స్పష్టమైన దృష్టిని కలిగిన బడ్జెట్. ఇందులో రైతులు, యువకులు, పేదలు, మధ్యతరగతి వారు, అందరినీ దృష్టిలో పెట్టుకున్నారు. సమన్యాయం, వృద్ధి, ఉద్యోగావకాశాలు వంటి అంశాలను పొందు పరిచారు. ప్రగతిపూర్వక, సానుకూల, ఆచరణ సాధ్యమైన బడ్జెట్ ఇది.

సోనియా గాంధీ, కాంగ్రెసు అధ్యక్షురాలు

ఎన్డీఏ బడ్జెట్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అని మండిపడ్డారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదని తెలిపారు. బడా కార్పోరేట్‌లకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. ఎన్డీఏ బడ్జెట్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. రూ. 17 లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్ల ట్యాక్స్ తగ్గింపులు మాత్రమే చేశారని చెప్పారు

రాజ్‌నాధ్ సింగ్, కేంద్ర హోం మంత్రి

ఆధునిక భారతాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు చాలా ఉపయోగపడే బడ్జెట్ ఇది. దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ఉపయోగపడుతుంది.

మనోహర్ పరికర్ (రక్షణ మంత్రి)

జైట్లీ తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు. ఆయనకు నేను 10కి 9 మార్కులు వేస్తాను.

ప్రకాష్ జవదేకర్ (పర్యావరణ శాఖ మంత్రి)

ఇది చారిత్రాత్మక బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. ఇది పేదల ప్రజల బడ్జెట్. పేదల కోసం తయారు చేసిన బడ్జెట్.

నితిన్ గడ్కరీ (కేంద్ర మంత్రి)

మొత్తం చరిత్రలోనే మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేసిన మొట్ట మొదటి బడ్జెట్ ఇది. దీని ద్వారా దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం మరింత మెరుగవుతుంది.

వెంకయ్య నాయుడు (కేంద్ర మంత్రి)

ఈ బడ్జెట్‌తో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఆమ్ జనతా బడ్జెట్. ఎంతో ప్రోత్సాహకరంగా, కొత్త ఆవిష్కరణలు జరిగేలా ఉంది.

Jaitley 2015 -16 budget: Who said what?

మన్మోహన్ సింగ్ (మాజీ ప్రధాని)

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో నాకు ఏ విధమైన ఆందోళన లేదు. అందులో ఉద్దేశ్యాలు బాగున్నాయి. కాకపోతే వాటి అమలుకు మాత్రం ప్రభుత్వం వద్ద సరైన రోడ్ మ్యాప్ ఉన్నట్లు నాకు అనిపించలేదు.

పిసి చాకో (ఎఐసిసి అధికార ప్రతినిధి)

ఈ బడ్జెట్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్లు ఇంకా పలు పనులు చేయాల్సి ఉంది.

మల్లికార్జున ఖర్గే (కాంగ్రెసు)

సాధారణ పౌరులను ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకోలేదు. ఇదొక విజన్ డాక్యుమెంట్ మాత్రమే. ముమ్మాటికీ కార్పోరేట్లు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ మాత్రమే.

మాయావతి (బిఎస్పీ)

ఇది పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్. ఈ బడ్జెట్ ఆచరణ సాధ్యం కాదు. దేశంలోని పేదలు, సామాన్యుల ఆశలకు తగినట్లుగా లేదు.

సుప్రీయా సూలే (ఎన్సీపి)

ఇది ముమ్మాటికీ విమర్శించాల్సిన బడ్జెటే. ప్రజలకు వారు ఇంకా చాలా చేయాల్సి ఉంది.

జై పాండా (బిజెడి)

ఇదొక బిగ్ బ్యాంగ్ బడ్జెట్. ఒడిషాకు వారు కొత్తగా కేటాయించిందేమీ లేదు. మా పక్క రాష్ట్రాలు ఎన్నో కేటాయింపులు పొందాయి. ఇలాంటి కేటాయింపులు పొందాల్సిన అవసరం మా రాష్ట్రానికి ఎంతో ఉంది.

కల్వకుంట్ల కవిత (టిఆర్ఎస్)

మెల్లగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. రైతులకు ప్రయోజనం కలిగించే అంశాలు బడ్జెట్‌లో లేవు, నిత్యావసర సరుకుల ధరల ప్రస్తావన లేదు. రుణమాఫీ గురించి మాట్లాడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+