మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం రద్దు.. పవన్ సంచలన నిర్ణయం వెనుక!

ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తుంది. అయితే ఈ సంవత్సరం జనసేన పార్టీ మార్చి 14వ తేదీన జరగవలసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల విషయంలో ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జనసేన నాయకత్వం కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది.

సభ్యత్వ నమోదుపై ఫుల్ ఫోకస్ చేస్తున్న జనసేన

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటితో ముగియవలసి ఉండగా, గడువును మరికొంత కాలం పొడిగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు జనసేన పార్టీకి ఎనిమిది లక్షల 70 వేల మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా భావించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని రద్దు చేసి మరీ సభ్యత్వాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Jana Sena Formation Day Event on March 14 Cancelled reason is Party Focuses on Membership Drive

ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేసుకున్న జనసేన

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలక దశలో ఉండడంతో, నేను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంతో పార్టీ శ్రేణుల ఫోకస్ సభ్యత్వ నమోదు నుంచి తప్పుతుందని భావించి, సభ్యత్వ నమోదు కే ప్రాధాన్యత నిస్తూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు ఉద్యమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.

పవన్ కళ్యాణ్ ఫోకస్ ఇదే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 2014 మార్చి 14 తేదీన జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని పవన్ కళ్యాణ్ పార్టీని ముందుకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా కీలక భూమిక పోషిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడం పైన కూడా ఫుల్ గా ఫోకస్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+