జనసేన అభ్యర్ధుల జాబితా ప్రకటన - మేయర్ గా రాధా, పిఠాపురం నుంచి అనూహ్యంగా..!!

మున్సిపల్ బరిలో పార్టీ అభ్యర్ధులను జనసేన ప్రకటించింది. కూటమిలో సీట్ల పంపకాల్లో భాగంగా జరిగిన కేటాయింపులకు అనుగుణంగా అభ్యర్ధులను ఎంపిక చేసింది. స్థానిక రిజర్వేషన్ల మేరకు అభ్యర్ధులను డిప్యూటీ సీఎం పవన్ ఖరారు చేసారు. ఊహించినట్లుగానే విజయవాడ నుంచి వంగవీటి రాధ పేరు ప్రకటించారు. మొత్తం నాలుగు కార్పోరేషన్లు, 21 మున్సిపాల్టీల నుంచి జనసేన పోటీ చేస్తోంది. అందులో భాగంగా తొలి జాబితా ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. విజయవాడ వైసీపీలో భారీ చేరికలు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. విజయవాడ వైసీపీలో భారీ చేరికలు

జనసేన నుంచి కార్పోరేషన్లు, మున్సిపాల్టీల అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఖరారైన నాలుగు కార్పోరేషన్లలో రెండు మేయర్ సీట్లకు ఎన్నికలు ఇప్పట్లో జరగటం లేదు. మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసారు. ఏలూరు: రెడ్డి అప్పల నాయుడు, విజయవాడ: వంగవీటి రాధాకృష్ణ పేరు అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా జనసేనకు కేటాయించిన మున్సిపాల్టీల్లో అమలాపురం: నల్లా శ్రీధర్, ⁠చిలకలూరిపేట: తోట రాజరాజేశ్వరి, ⁠గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు, ⁠నరసాపురం: కొత్తపల్లి శైలజ, నిడదవోలు: కల్లం జ్యోతి, పెడన: మట్టా శివపావని, పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు: డి. ఏలు మలై, సాలూరు: గొర్లె విజయకుమారి పేర్లు ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఫిర్యాదులకు విజయవాడలో కంట్రోల్ రూమ్!
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఫిర్యాదులకు విజయవాడలో కంట్రోల్ రూమ్!
Janasena announces the contesting candidates for mayor and Municipal chairmans here the list

కాగా, సామర్లకోట: పిట్టా జానకి రామారావు, తెనాలి: తోటకూర వెంకట రమణారావు, తిరువూరు: పి. మాధవి పేర్లను పార్టీ ప్రకటించింది. కాగా.. రెండో జాబితాలో మిగిలిన మున్సిపాల్టీల అభ్యర్ధులను ప్రకటించనున్నారు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావటంతో ఈ సాయంత్రానికి తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది. అభ్యర్ధుల ప్రకటన పైన పవన్ తుది కసరత్తు చేస్తున్నారు. స్థానిక రిజర్వేషన్లు.. నేతల అభిప్రాయల మేరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. మున్సిపల్ అభ్యర్ధుల ఖరారు పూర్తి చేసిన తరువాత జెడ్పీటీసీ.. ఎంపీటీసీ అభ్యర్ధుల పైన కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఇక.. కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో నూ పోటీ చేసే కార్పోరేటర్లు.. కౌన్సిలర్ల ఖరారు పైన మూడు పార్టీల నేతలు సమావేశాలు కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+