వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంట్ పై జిందాల్ స్టీల్స్ నజర్; విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలుకు బడా కంపెనీల ఆసక్తి

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను 100% ప్రైవేటీకరణ చేస్తామని తేల్చిచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఆదిశగా అడుగులు కూడా ముందుకు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై జిందాల్ స్టీల్ కన్నుపడింది.

నెల్లూరులో జిందాల్ స్టీల్స్ ప్లాంట్ కు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

నెల్లూరులో జిందాల్ స్టీల్స్ ప్లాంట్ కు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

గతంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. ఈ మేరకు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములను కూడా కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరులో 7,500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నులు సామర్ధ్యంతో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జిందాల్ సంస్థకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదలా ఉంటే తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయటానికి కూడా జిందాల్ స్టీల్స్ ఆసక్తిని కనబరుస్తోంది.

విశాఖ స్టీల్ పై జిందాల్ నజర్ .. నాగర్నార్ ప్లాంట్ కూడా దక్కించుకోవాలని యోచన

విశాఖ స్టీల్ పై జిందాల్ నజర్ .. నాగర్నార్ ప్లాంట్ కూడా దక్కించుకోవాలని యోచన

విశాఖ ఉక్కు పరిశ్రమ తో పాటుగా నాగర్నార్ ప్లాంటును దక్కించుకున్న యోచనలో జిందాల్ స్టీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి తాము ఆసక్తిని కనబరుస్తున్న మని జిందాల్ స్టీల్ ఎండి పేర్కొన్నారు. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి విఫలమైంది నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్స్ ఇప్పుడు తన ఫోకస్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్ మరియు నాగర్నార్ స్టీల్ ప్లాంట్ పై పెట్టింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

కేంద్ర నిర్ణయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బడా కంపెనీలు

కేంద్ర నిర్ణయంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బడా కంపెనీలు

ఎన్ఎండిసి నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌కు 3 టన్నుల వార్షిక సామర్థ్యం, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది. ఇదిలా ఉంటే జిందాల్ స్టీల్స్ దక్కించుకోలేకపోయిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌కు 1.1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉంది. దీనిని టాటా గ్రూప్ దక్కించుకుంది. టాటా గ్రూప్ సంస్థ అయిన టాటా స్టీల్ రూ. 12,100 కోట్లకు కొనుగోలు చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బడా కార్పొరేట్ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.

 విశాఖ స్టీల్ పై టాటా స్టీల్ ఆసక్తిపై వార్తలు .. ఇప్పుడు జిందాల్ స్టీల్ దృష్టి

విశాఖ స్టీల్ పై టాటా స్టీల్ ఆసక్తిపై వార్తలు .. ఇప్పుడు జిందాల్ స్టీల్ దృష్టి

గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని దక్కించుకోడానికి టాటా స్టీల్స్ ఆసక్తి చూపిస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం జిందాల్ స్టీల్స్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఉక్కును ఉత్పత్తి చేస్తూ, లాభాల బాటలో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పింది.

Recommended Video

కేంద్రంతో ఏపి సీఎం కు రహస్య ఒప్పందాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేసిన వీహెచ్ || Oneindia Telugu
 విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుపై ఆసక్తి ఉందన్న జిందాల్ స్టీల్స్ సంస్థ

విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుపై ఆసక్తి ఉందన్న జిందాల్ స్టీల్స్ సంస్థ


విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నామని జిందాల్ స్టీల్స్ ప్రకటించడంతో దీనికోసం తెరవెనుక చురుగ్గా ఏదైనా కసరత్తు జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ ప్రైవేటీకరణ చెయ్యొద్దని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, బీజేపీ మినహా అఖిలపక్ష పార్టీల నాయకులు ఏకకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముహూర్తం ఫిక్స్ అయింది గా కనిపిస్తోంది. ఎలాగైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను జిందాల్ స్టీల్స్ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Jindal Steels looks at the Visakhapatnam steel plant. Jindal Steels is interested in buying Nagarnar Steel along with Visakhapatnam Steel Plant. Aside from the movement for a steel plant, big companies are showing interest in buying Visakha steel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X