ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్!!
2024 సంవత్సరంలో జరుగనున్న 96వ ఆస్కార్స్ కు సన్నాహాలు మొదలయ్యాయి. అకాడమీ 2023 సంవత్సరానికి ఆస్కార్ జ్యూరీకి కొత్త సభ్యులను ఆహ్వానించింది. మొత్తం 398 మంది కొత్త సభ్యులను జ్యూరీలోకి అకాడమీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా అందరికీ తెలియజేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం నుండి ఆరుగురు సభ్యులు 2023 అకాడమీ జ్యూరీకి ఆహ్వానించబడ్డారు.
జ్యూరీ లోకి కొత్త సభ్యులుగా ఆహ్వానించ బడిన వారిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎం ఎం కీరవాణి, చంద్ర బోస్, సాబు సిరిల్, కేకే సెంథిల్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జ్యూరీ ఆఫ్ ది అకాడమీ అవార్డులలో ఒక చిత్ర బృందం నుండి ఆరుగురు సభ్యులు రావడం ఇదే తొలిసారి.

మార్చి నెలలో అత్యంత ప్రతిష్టాత్మక చలనచిత్ర మైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా మొట్టమొదటి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబెల్ స్టార్స్ గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ద్వారా వీరు సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే అకాడమీ జ్యూరీలో కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్థానం దక్కడం పై ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.
ఏకంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్ర బృందం లోని ఆరుగురికి ఆహ్వానం రావడం పైన తెలుగు వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీలో ప్రస్తుతం 10 వేల మంది సభ్యులు ఉన్నారు . ఈ సంవత్సరం ఆహ్వానించబడిన వారందరూ ఆహ్వానాన్ని అంగీకరిస్తే ఈ సంఖ్య 10,817 కు పెరుగుతుంది. అందులో 9, 375 మంది ఓటు వేయడానికి అర్హులు.
అకాడమీలో జ్యూరీ సభ్యులుగా ఉండటంవల్ల ఇందులో ఉండే కళాకారులు తదుపరి అకాడమీ అవార్డులలో ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇదిలా ఉంటే అకాడమీ జ్యూరీలో కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్థానం దక్కడం పై, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. ఇది తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం అని వారంటున్నారు.












Click it and Unblock the Notifications