తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్ళను తిట్టి ఇప్పుడు పొగుడుతారా? కేఏ పాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని కొనలేని వారు విశాఖ ఉక్కును కొంటారా అంటూ కేఏ పాల్ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికి ముఖ్య మంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్న కేఏ పాల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం నెరవేరాలంటే రాజ్యాధికారం కావాలి కానీ విగ్రహాలు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రధానితో పోటీపడి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారని ఆరోపించారు. అంతేకాదు తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కెసిఆర్ తనను చంపించడం కోసం ప్లాన్ కూడా చేశారంటూ కెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ రాజకీయాలపై మండిపడిన కేఏ పాల్ గతంలో ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళను తిట్టి ఇప్పుడు ఏపీని పొగుడుతారా అంటూ నిలదీశారు.

సింగరేణి కొనలేని వారు విశాఖ ఉక్కును కొంటారా అంటూ ప్రశ్నించారు. 2008లో కేసీఆర్ తన వద్దకు పది కోట్లు అడగడానికి వచ్చారని పేర్కొన్న కేఏ పాల్ ఇప్పుడు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశం మరో శ్రీలంక గా మారుతోందని కేఏ పాల్ అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ హిట్లర్ వర్ధంతి రోజున సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారని, అలా ఎలా చేస్తారు అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.
అక్టోబర్ ఒకటవ తేదీన జరిగే గ్లోబల్ శాంతి సభను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని కేఏ పాల్ పేర్కొన్నారు. అక్టోబర్ 1 గ్లోబల్ పీస్ సభ, అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ మీటింగ్ జరుగుతుందని పేర్కొన్న కేఏ పాల్ హైదరాబాద్ వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి గ్లోబల్ పీస్ మీటింగ్ ను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమ్మిట్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కేఏ పాల్ సూచించారు. తెలుగు ప్రజల జీవితాలను తాను మాత్రమే మార్చగలనని కేఏ పాల్ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయం ప్రారంభాన్ని తాను ఆపగలిగాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.












Click it and Unblock the Notifications