నీ బాబును జైల్లో పెడతా,నిన్ను జైల్లో పెట్టి తీరతా ..నారా లోకేశ్‌కు మాస్ వార్నింగ్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలోని కూటమి నేతలపై ఆయన నిప్పులు చెరిగారు.ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్‌పై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేఏ పాల్.. కూటమి ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. రెడ్‌బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బుక్ తీశానంటే నువ్వు ఉండవని కేఏ పాల్ హెచ్చరించారు. నా పవర్ గురించి నీ బాబును కనుక్కో అని సూచించారు.
నువ్వు తీసే బుక్ ఏంటి? ఎంతమంది మీద దాడి చేయిస్తున్నావని నారా లోకేశ్‌పై మండిపడ్డారు. నిన్ను జైల్లో పెట్టి తీరతా అని హెచ్చరించారు. నీ బాబు జైలుకు వెళ్తాడని చెప్పా.. అన్నట్టే జరిగిందని గుర్తుచేశారు. ' ఏం వాగుతున్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. ఇంకా ఎవరైనా వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడిని అయినా టచ్ చేస్తే.. నీ బాబును జైల్లో పెడతా.. నిన్ను జీరోను చేస్తా' అని వార్నింగ్ ఇచ్చారు.

ఇకనుంచి ఎవరైనా వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడిని అయినా రెడ్ బుక్ పేరుతో టచ్ చేస్తే.. నీ బాబును జైల్లో పెడతా.. నిన్ను జీరోను చేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉందని పిచ్చోడిలా బిహేవ్ చేయొద్దు.. బీకేర్‌ఫుల్ హితవు పలికారు.వైఎస్ఆర్ కాలిగోరు తీయడానికి కూడా లోకేశ్ సరిపోడని కేఏ పాల్ అన్నారు. మీ నాన్న కూడా వైఎస్ఆర్‌కు భయపడేవాడని తెలిపారాయన.మీ నాన్నను వైఎస్ఆర్ ఏమీ చేయకుండా తానే కాపాడానని.. కావాలంటే మీ బాబును కనుక్కో అన్నారు.
ఒరేయ్ లోకేష్ గా వాళ్ళ ముందు నీ రెడ్ బుక్ ఎంత?
— Rahul (@2024YCP) February 4, 2025
ఆ రోజు YSR తలుచుకునుంటే మీ నాన్న గతి ఎందో తెలుసుకో
- లోకేష్,బాబుని ఉతికారేసిన కేఏ పాల్🔥🔥 pic.twitter.com/BvMZbAvFYg
నా స్పిరిట్యూవల్ పవర్ వాడానో.. వాడు ట్రంప్ అయినా.. బైడెన్ అయినా.. మోడీ అయినా దిక్కు లేదని తెలిపారు.జగన్ ఎప్పుడూ తన మీద కేసులు పెట్టలేదని కేఏ పాల్ తెలిపారు. జగన్ ఎన్నికల ముందు తనను కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్యాకేజి స్టార్లు చిరంజీవి, పవన్ కల్యాణ్, షర్మిలను మరిచిపోయి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. ప్రజల్ని గెలిపిద్దామని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications