కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాటసాని...ఆ మాట అనేశాడు:కర్నూలు వైసిపిలో కలకలం!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

కర్నూలు: వైసిపిలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు కర్నూలు జిల్లా వైసిపిలో కలకలం రేపుతున్నాయి. బిజెపి నుంచి వైఎస్ఆర్ సిపిలో చేరిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని వచ్చే ఎన్నికల్లో తన ప్రాతినిథ్యం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇంతకూ కాటసాని ఏమన్నారంటే?...2019 ఎన్నికల్లో పాణ్యం నుంచే పోటీ చేస్తానని, పాణ్యం వీడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. 2019లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల ఆదరణ అభిమానం ఉండేంత వరకు పాణ్యం నియోజకవర్గాన్ని తాను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఓర్వకల్లు మండల క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 Katasani crucial comments over Panyam MLA ticket

పాణ్యం మండలంలోని కాల్వబుగ్గ టీడీపీ కళ్యాణ మండపంలో జరిగిన ఓర్వకల్లు మండల క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి వైసీపీ జిల్లా నాయకులు ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాటసాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంకా కాటసాని మాట్లాడుతూ జగన్
ముఖ్యమంత్రి అయితే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

ఓర్వకల్లులోని పవర్‌గిడ్ర్‌, శకునాలలోని సోలార్‌ బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. మంచాలకట్ట, ఎస్‌ఆర్‌బీసీల నుంచి ఓర్వకల్లుకు తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నన్నూరులో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, హుసేనాపురంలో రింగ్‌రోడ్డు, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తక్షణమే పనులు ప్రారంభిస్తారన్నారు.

అయితే ఇటీవల కాటసాని వైసిపి కార్యకర్తలకు సంబంధించి ఏ సమావేశం జరిగినా ఇదే ప్రస్తావన తెస్తుండటం వైసిపిలో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. కారణం పార్టీ అధినేత జగన్ పాణ్యం టికెట్‌ పై హామీ ఇవ్వడంతోనే వైసీపీలో చేరానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టంగా చెబుతుండగా...మరోవైపు వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరుచరిత ఆయన వ్యాఖ్యలను కొట్టిపడేస్తున్నారు.

పాణ్యం వైసీపీ నియోజకవర్గం టికెట్‌ తమదేనని ఎమ్మెల్యే గౌరుచరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఇటీవలికాలంలో కాటసాని పాణ్యం లో పోటీ గురించి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం జరిగిన నియోజకవర్గ క్షేత్ర స్థాయి కన్వీనర్ల సమావేశంలో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీకి సేవచేస్తూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తమకే టికెట్‌ వస్తుందని, అందులో ఎలాంటి సందేహాలు వద్దని గౌరు చరిత ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకుడు, పాణ్యం టికెట్‌ తమదేనంటూ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. దీంతో వైసిపిలో పాణ్యం రగడ తప్పదని స్థానిక వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.

English summary
Kurnool:Panyam MLA Ticket is likely to create problems in the Kurnool district YCP. Two YSRCP leaders including sitting MLA are fighting for this seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X