కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచార సభల్లో దూసుకుపోతున్నారు. ఈసారి ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని టిడిపి, ఖచ్చితంగా విజయం సాధించాలని వైసిపి ముందుకు వెళుతున్నాయి.

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ప్రచారాస్త్రం కేసీఆర్

ఏపీ ఎన్నికల్లో టీడీపీ ప్రచారాస్త్రం కేసీఆర్

అయితే ఏపీ ఎన్నికల్లో వేలు పెడతానన్న కేసీఆర్, ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ జగన్ కు సహకరిస్తూ ఏపీ అభివృద్ధి కాకుండా అడ్డుకోవాలని కంకణం కట్టుకున్నారని చంద్రబాబు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ టార్గెట్ గా చంద్రబాబు చేస్తున్న ప్రచారం తో పాటుగా ఇప్పుడు ఏపీ లోని టీడీపీ శ్రేణులు కూడా వినూత్న ప్రచారానికి తెరలేపాయి.

కేసీఆర్ కే కాదు సెంటిమెంట్ ... ఆంధ్రా ప్రజలకు కమిట్మెంట్ వుంది

కేసీఆర్ కే కాదు సెంటిమెంట్ ... ఆంధ్రా ప్రజలకు కమిట్మెంట్ వుంది

‘కేసీఆర్‌ మీకే కాదు తెలంగాణ సెంటిమెంట్‌.. మాకూ ఉంది ఆంధ్రాను కాపాడుకునే కమిట్‌మెంట్‌' అంటూ మహిళలు, ఆటో యూనియన్‌ సభ్యులు నిర్వహించిన ర్యాలీ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏపీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పటికీ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి కి సహకరిస్తుంది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కెసిఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్ర ప్రజలకి కమిట్మెంట్ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా అనంతపురంలో ర్యాలీ ఆసక్తికరం

కేసీఆర్ టార్గెట్ గా అనంతపురంలో ర్యాలీ ఆసక్తికరం

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా అమరాపురం మండల కేంద్రంలోని సిండికేట్‌ బ్యాంక్‌ నుంచి బస్టాండు వరకు నిర్వహించిన ర్యాలీ ఏపీలో ఆసక్తికరంగా మారింది. ఈ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మీ తెలంగాణ సెంటిమెంట్ ను కాపాడుకోవడం గొప్ప అయితే, మాకు మా ఆంధ్రను కాపాడుకోవడం కమిట్మెంట్ అంటూ బ్యానర్లతో నిర్వహించిన ర్యాలీ పై ఏపీ లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+