అన్నదాత సుఖీభవ పథకంపై రైతులకు కీలక అలెర్ట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇప్పటివరకు 47 లక్షల మంది రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమ అయ్యింది. అయితే అన్నదాత సుఖీభవ లో తొలి విడత ఆర్థిక సహాయం అందని రైతులకు ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

అన్నదాత సుఖీభవ దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
సాంకేతిక కారణాల వల్ల అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందని రైతులు ఆగస్టు 25వ తేదీ లోపు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అలర్ట్ ఇచ్చింది. రైతులు వారికి అన్నదాత సుఖీభవ ఎందుకు రాలేదో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, సమస్యలు పరిష్కరించుకుని మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

Key alert for farmers on Annadata Sukhibhava scheme

Take a Poll

ఆ రైతులకు దరఖాస్తుకు అవకాశం
ఏపీలో పీఎం కిసాన్ యోజనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ డబ్బు కూడా మొత్తం మూడు విడతల్లో రైతులకు అందుతుంది. ఇందులో మొదటి విడతగా 7000, రెండవ విడతగా 7000, మూడవ విడతగా 6 వేల రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయనుంది. అయితే అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థికసహాయం అందని రైతులు సంబంధిత వివరాలతో దరఖాస్తులు చేసుకుంటే ఆర్థికసహాయం పొందే అవకాశం కల్పించనుంది.

అన్నదాత సుఖీభవ సాయం అందని వారు వీరే
లబ్ధిదారుల మరణం, బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ నమోదు చేయకపోవడం, లేదా ఈకేవైసీ పెండింగ్ ఉండడం వంటి కారణాలతో చాలామంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి చేకూరలేదు. అలాగే భూముల క్రయవిక్రయాలు, బదిలీలు వంటివి జరిగినచోట కూడా అన్నదాత సుఖీభవ సాయం అందలేదు.

సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుంటే అన్నదాత సుఖీభవ లబ్ది
అయితే అటువంటి వారంతా సాంకేతికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకొని దరఖాస్తు చేసుకుంటే వీరు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా సాయం అందింది. రేపే దరఖాస్తుకు లాస్ట్ డేట్ కావటంతో రైతులూ అలెర్ట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+