చంద్రబాబు బతుకెంత; లోకేష్ లాంటి అటు ఇటు కాని వాళ్లతో ఏం యుద్ధం చేస్తాం: కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై వైసీపీ మంత్రి కొడాలి నాని మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తామంటూ హెచ్చరించారు. ప్లాన్ ప్రకారమే సీఎం జగన్ పై టిడిపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని దుయ్యబట్టారు.

 సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంచ్ కూడా కదపలేరు

సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంచ్ కూడా కదపలేరు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు కావాలనే వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు అంటూ మండిపడిన కొడాలి నాని, చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని పట్టాభి జగన్ మోహన్ రెడ్డి ని తిడుతున్నారు అంటూ ఆరోపించారు. చంద్రబాబు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంచ్ కూడా కదపలేరని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మొదటి నుంచి చంద్రబాబు మోసపూరిత రాజకీయాలే చేస్తున్నారు అంటూ మండిపడిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు.

తాము నలుగురమే తిట్టేది .. తమను తిట్టేవాళ్ళు చాలా మందే ఉన్నారు

తాము నలుగురమే తిట్టేది .. తమను తిట్టేవాళ్ళు చాలా మందే ఉన్నారు

తాము నలుగురమే తిట్టేదని తమను చాలామందిని పెట్టి చంద్రబాబు తిట్టిస్తున్నారు అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేత పట్టాభి చాలా అవమానకరంగా మాట్లాడారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఎవరిని తిట్టలేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబుకు రోజుకో ప్రెస్ మీట్ లేకపోతే నిద్ర పట్టదు అంటూ విమర్శించారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి తిట్టిస్తున్నాడని, అలా తిట్టడం తమకు రాదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పథకం ప్రకారం డ్రగ్స్ పై దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.

ఏ ముఖం పెట్టుకొని అమిత్ షా ను కలుస్తావ్

ఏ ముఖం పెట్టుకొని అమిత్ షా ను కలుస్తావ్

రాష్ట్రంలో తాజా పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు త్వరలో అమిత్ షా ను కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో చంద్రబాబు అమిత్ షా ను కలవడం పై కొడాలి నాని చంద్రబాబును ప్రశ్నించారు. అమిత్ షా పై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారని, చంద్రబాబు ఎలాంటివాడో అమిత్ షా, మోడీ లకు తెలుసని పేర్కొన్న కొడాలి నాని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అమిత్ షా ను కలుస్తావంటూ చంద్రబాబును ప్రశ్నించారు. సిగ్గుందా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలను, కొంగ జపాలను ఎవరూ నమ్మరంటూ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

జగన్ డ్రగ్స్ దందా అంటూ పిచ్చి వాగుడు

జగన్ డ్రగ్స్ దందా అంటూ పిచ్చి వాగుడు


చంద్రబాబు నాయుడు రోజుకో రాజకీయం చేస్తున్నాడని, ఏపీలో ఏదో జరిగిపోతుందని శాంతిభద్రతలు లేవని ప్రచారం చేస్తున్నాడని కొడాలి నాని పేర్కొన్నారు. దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్ సప్లై చేస్తున్నాడని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది టిడిపి అంటూ విమర్శించారు. తాడేపల్లి నుండి డ్రగ్స్ వైయస్ జగన్ ప్రపంచానికి సరఫరా చేస్తున్నాడు అన్నట్టు పిచ్చి వాగుడు బాగున్నారని మండిపడ్డారు. గతంలోనూ చంద్రబాబు వైయస్ రాజశేఖర్ రెడ్డి ని టార్గెట్ చేశారని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించాడు అని పేర్కొన్న కొడాలి నాని వైయస్ జగన్ యుక్త వయస్సు నుంచే ఆయనపై కుట్రలు చేయడం ప్రారంభించారు అంటూ ధ్వజమెత్తారు.

చంద్రబాబు బతుకెంత.. టిడిపి ఆఫీస్ ఎంత ?

చంద్రబాబు బతుకెంత.. టిడిపి ఆఫీస్ ఎంత ?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైయస్ జగన్ పైన ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు బతుకెంత.. టిడిపి ఆఫీస్ ఎంత అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని చేసినా జగన్ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాడని వ్యాఖ్యానించారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కొడాలి నాని హితవుపలికారు. పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫాంహౌస్లో పడుకున్నాడని, ఇప్పుడు టిడిపి ఆఫీస్ లో రెండు కుర్చీలు విరగగానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

మగాళ్లతో ఫైట్ చేస్తాం కానీ లోకేష్ లాంటి అటు ఇటు కాని వాళ్లతో ఏం చేస్తాం

మగాళ్లతో ఫైట్ చేస్తాం కానీ లోకేష్ లాంటి అటు ఇటు కాని వాళ్లతో ఏం చేస్తాం

లోకేష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తాం కానీ లోకేష్ లాంటి అటు ఇటు కాని వాళ్లతో ఏం యుద్ధం చేస్తామంటూ విమర్శించారు. నేరుగా మాట్లాడుకుందాం రా అంటూ తాజాగా లోకేష్ విసిరిన ఛాలెంజ్ కు తాము స్పందించలేమని చెప్పిన కొడాలి నాని వైసిపి అభ్యర్థిపై చిత్తుగా ఓడిపోయిన వాడితో మాకేంటి పోటీ అంటూ వ్యాఖ్యానించారు. జీవితంలో ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత లోకేష్ చాలెంజ్ చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు.

 చంద్రబాబుపై పదేపదే కొడాలి ఆగ్రహం .. చిలికి చిలికి గాలివానగా మారుతున్న రగడ ..

చంద్రబాబుపై పదేపదే కొడాలి ఆగ్రహం .. చిలికి చిలికి గాలివానగా మారుతున్న రగడ ..

ఈరోజు ఉదయం టిడిపి కార్యాలయంలో నాలుగు బల్లలు కుర్చీలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా అంటూ ప్రశ్నించిన కొడాలి నాని, చంద్రబాబు 420 అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోమారు చంద్రబాబు పై నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేతలపై దుమ్మెత్తిపోశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు పర్వం కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు మోతాదును పెంచి మరి తిట్టుకుంటున్నారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారి దాడులు, బంద్, అరెస్టులు, పోలీస్ కేసుల దాకా వెళ్ళింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+