షాకింగ్ న్యూస్: రాజకీయాల్లోకి కోడికత్తి శ్రీను; ఆ పార్టీలో చేరిక; అమలాపురం నుండే పోటీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఒక షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏపీలో జగన్ పై దాడి కేసులో సుదీర్ఘకాలం శిక్షణ అనుభవించిన కోడి కత్తి శ్రీను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జగన్ పై హత్య కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శ్రీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు.
నిన్న రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీలోకి ఆయనను ఆహ్వానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అమలాపురం నియోజకవర్గం నుంచి కోడి కత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే జైలు జీవితం తనలో చాలా పరివర్తన తీసుకువచ్చిందని తాను ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని కోడికత్తి శ్రీను వెల్లడించారు. ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతానని జై భీమ్ భారత పార్టీలో చేరిక ముందు పేర్కొన్న ఆయన అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పై జై భీమ్ భారత్ పార్టీ తరఫున దస్తగిరి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో కోడికత్తి శ్రీను కూడా కూడా జై భీమ్ భారత్ పార్టీలో చేరడం ఆసక్తిని కలిగిస్తుంది.
కాగా జగన్ ప్రభుత్వం లో దగా పడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావుకు జై భీమ్ భారత్ అండగా ఉంటుందని జనపల్లి శ్రీనివాసరావు దళిత రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని, అందుకే తమ పార్టీలో అవకాశం కల్పించామని చెప్పారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయాలు మారాలని ఆయన పేర్కొన్నారు.
యువతను జై భీమ్ భారత్ పార్టీ ఆహ్వానిస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయని కానీ జై భీమ్ భారత పార్టీ సామాన్యులకు రాజకీయ అవకాశం కల్పిస్తుందని, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ వెల్లడించారు అధికార మదంతో, తమ వద్ద డబ్బుందన్న అహంకారంతో వైసిపి నేతలు విర్రవీగుతున్నారని ఆయన మండిపడ్డారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications