కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూట్‌మార్చారు: మంత్రిని చేస్తా.. మీరు చెప్పినంత లేదు.. జగన్‌కు బుట్టా రేణుక షాక్

కర్నూలు జిల్లాకు చెందిన వైసిపి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో వారితో శనివారం వైసిపి అధినేత వైయస్ జగన్ భేటీ అయ్యారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు/హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన వైసిపి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో వారితో శనివారం వైసిపి అధినేత వైయస్ జగన్ భేటీ అయ్యారు.

చదవండి: భారీ షాక్: టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్? ఏం చేద్దామని జగన్ ఆరా

జగన్‌ను కలిసిన వారిలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మల్యేలు బాలనాగి రెడ్డి, జయరాములు, సాయి ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.

చదవండి: చిరు కోరిక మేరకు 'ఆమె' తప్పుకుంది: కాంగ్రెస్ పార్టీలో చిరంజీవికి కొత్త పదవి

అసలు మీ సమస్య ఏమిటి?

అసలు మీ సమస్య ఏమిటి?

హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని జగన్‌ నివాసంలో వారంతా అధినేతను కలిశారు. పార్టీ మారతారన్న ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయ్‌? మీకున్న ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలపై జగన్‌ వారి నుంచి ఆరా తీశారని సమాచారం. జిల్లాలో, వారి నియోజకవర్గాల్లో పరిస్థితుల గురించి చర్చ జరిగినట్లు సమాచారం.

టిక్కెట్ మీకేనని చెప్పా కదా

టిక్కెట్ మీకేనని చెప్పా కదా

భేటీలో ప్రధానంగా ఎంపీ బుట్టా రేణుక విషయమై చర్చ సాగినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ కర్నూలు ఎంపీగా పార్టీ టిక్కెట్‌ మీకే ఖరారు చేస్తాం, బీసీలకే టికెట్‌ ఇద్దామనుకున్నాం కదా? అని జగన్‌ ఆమెతో చెప్పినట్లుగా తెలుస్తోంది.

మంత్రివర్గంలోకి తీసుకుంటా

మంత్రివర్గంలోకి తీసుకుంటా

ఎంపీగా పోటీ చేసేందుకు ఇబ్బందైతే జిల్లాలోనే ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని, అప్పుడు మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటామని బుట్టా రేణుకకు జగన్‌ భరోసా ఇచ్చారని తెలుస్తోంది.

మీరు చెప్పినంత లేదు.. జగన్‌తో నేతలు

మీరు చెప్పినంత లేదు.. జగన్‌తో నేతలు

కర్నూలు ప్రజాప్రతినిధులతో జగన్ దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో మనం కచ్చితంగా అధికారంలోకి వస్తామని, నేను సీఎం అవుతానని చెప్పారు. అయితే నేతలు మాత్రం ఆయనతో విబేధించారు. నియోజకవర్గాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని, నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మరింత భిన్నంగా మారిందని వారు సూటిగా చెప్పారని తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా స్థానికంగా లేదని చెప్పారని అంటున్నారు. దీంతో జగన్ ఖిన్నుడయ్యాడని అంటున్నారు.

బహిరంగంగా చెప్పండి... నేడే రేపో రేణుక ప్రకటన

బహిరంగంగా చెప్పండి... నేడే రేపో రేణుక ప్రకటన

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి రెండ్రోజుల కిందట బహిరంగంగా ప్రకటించిన అంశం చర్చకు వచ్చింది. మిగిలిన వారు కూడా ఇలాంటి ఊహాగానాలను బహిరంగా ఖండించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుట్టా రేణుక నేడో రేపో బహిరంగ ప్రకటన చేయనున్నారని అంటున్నారు.

రూట్ మార్చిన జగన్

రూట్ మార్చిన జగన్

ఇదిలా ఉండగా, ప్రారంభంలో ఎవరైనా నేతలు పార్టీ మారితే జగన్ పట్టించుకునే వారు కాదు. కానీ 2019లో గెలువాలని గట్టిగా కోరుకుంటున్న జగన్ ఇటీవల కాలంలో జంప్ చేస్తామన్న నేతలతో నేరుగా మాట్లాడి, వారిని బుజ్జగిస్తున్నారు. ఇటీవలి వరకు ఇతల నేతల ద్వారా బుజ్జగింపులు జరిపిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు ఆయనే నేరుగా రంగంలోకి దిగి నేతలను పిలిపించుకొని మాట్లాడారు. ఇటీవల హిందువులను మచ్చిక చేసుకునేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చేందుకు జగన్ రూట్ మార్చారని అంటున్నారు.

English summary
Kurnool YSR Congress Party leaders Butta Renuka, Bala Nagi Reddy, Jayaramullu, Sai Prasad Reddy meet party chief YS Jaganmohan Redddy and deny leaving party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X