చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్; ఎవరినీ వదిలిపెట్టని లక్ష్మీపార్వతి షాకింగ్ వ్యాఖ్యలు

టిడిపి అధినేత చంద్రబాబు పైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ ల పైన తనదైన శైలిలో విమర్శలు చేశారు తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి. మంగళవారం మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి లోకేష్ పాదయాత్రలో రోజుకు ఒక కామెడీ బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు. ఏమీ రాని దద్దమ్మ, ఒకచోట కూడా గెలవలేని లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

ప్రతిపక్ష పార్టీ రోజురోజుకు దిగజారిపోతుందని వ్యాఖ్యలు చేసిన ఆమె, ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడి ఆరు నెలలైనా అర్థం కాదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు కూడా సీఎం జగన్ అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను చెప్పలేక బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు.

Lakshmi Parvathi

ఇక సోషల్ మీడియాలో పనికిమాలిన వెధవల్ని, కుక్కల్ని పోషిస్తున్నారని తిట్టిపోశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీలను చంద్రబాబు పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి ప్రతి రాష్ట్రంలోనూ సంస్కృత అకాడమీ ఉండడంతో ఏపీలో తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవతో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు జరిగిందన్నారు లక్ష్మీపార్వతి.

చంద్రబాబు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో మోసాలు చేశారని లక్ష్మి పార్వతి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కూడా అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు సైకో అని, ఆయన పాపాలు పండాయి అంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్, దుబాయ్ లలో చంద్రబాబు 5 లక్షల కోట్లు దాచిపెట్టారని ఆరోపించిన లక్ష్మీపార్వతి ప్రధాని మోడీ ఈ నల్లధనాన్ని బయటకు తెప్పించి స్వదేశానికి రప్పించాలంటూ వ్యాఖ్యలు చేశారు.

Lakshmi Parvathi

ఇక ఇదే సమయంలో సీఎం జగన్ పై విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన లక్ష్మీపార్వతి పవన్ కళ్యాణ్ చదువుతున్న పుస్తకాల జ్ఞానం ఎక్కడికి పోయింది అంటూ మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారని పేర్కొన్న లక్ష్మీపార్వతి తనదైన శైలిలో చంద్రబాబును, బాలయ్య, లోకేష్ లను, పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+