
లక్ష్మీ పార్వతి దూకుడు, లోకేష్ తాటతీస్తామని వ్యాఖ్యలు, రేసులో ఆమె కూడానా ? ఇంట్రెస్టింగ్ చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల మాటల దూకుడు ఏపీ రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చనీయాంశమే. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు ప్రతిపక్ష పార్టీపై చంద్రబాబు, లోకేష్ లపై కాస్త డోస్ పెంచి వ్యాఖ్యలు చేసే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ జాబితాలో లక్ష్మీపార్వతి కూడా చేరుతున్నారని టాక్ వినిపిస్తుంది. తాజాగా లక్ష్మీపార్వతి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు అందుకు కారణంగా కనిపిస్తున్నాయి.

పిచ్చిగా మాట్లాడితే తాటతీస్తాం అని వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ పార్వతి
తాజాగా
తెలుగు
సంస్కృతి
అకాడమీ
చైర్పర్సన్
లక్ష్మీపార్వతి
చంద్రబాబు,
నారా
లోకేష్
పై
విరుచుకుపడ్డారు.
సీఎం
జగన్
పై
లోకేష్
సంస్కారం
లేకుండా
మాట్లాడుతున్నాడని,
పిచ్చి
పిచ్చిగా
మాట్లాడితే
తాట
తీస్తామని
వార్నింగ్
ఇచ్చారు
లక్ష్మీ
పార్వతి
.
లక్ష
కోట్లు
దోచుకున్న
చంద్రబాబు,
లోకేష్
లు
ధనబలంతో
మదమెక్కి
మాట్లాడుతున్నారని
మండిపడ్డారు.
చంద్రబాబు,
లోకేష్
లు
మేనేజ్
చేసుకుని
కేసుల
నుండి
తప్పించుకున్నారని
లక్ష్మీపార్వతి
తీవ్ర
అసహనం
వ్యక్తం
చేశారు.

జగన్ కనుసైగ చేస్తే చాలు .. దేనికైనా సిద్ధం అంటూ వ్యాఖ్యలు
నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించిన లక్ష్మీపార్వతి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు అంటూ లోకేష్ ను పచ్చిగా తిట్టేశారు. జగన్ కనుసైగ చేస్తే చాలు లోకేష్ ఏం చేసేందుకైనా సిద్ధమని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు చేశారు. ఏడో తరగతి కూడా పాస్ కాని వ్యక్తికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లో సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అందరికీ తెలుసు అని లోకేష్ ను టార్గెట్ చేశారు. టిడిపి ఎన్ని చేసినా అధికారంలోకి రావడం అసాధ్యమని పేర్కొన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదన్న భయంతోనే లోకేష్ తో ఇలా మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు లక్ష్మీ పార్వతి. ఇక అద్భుతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని జగన్ ను ప్రజలంతా ప్రశంసిస్తున్నారు అని కితాబిచ్చారు.
Recommended Video

లక్ష్మీ పార్వతి షాకింగ్ వ్యాఖ్యలపై ఏపీలో చర్చ .. ఆ పదవుల కోసం చూస్తున్నారా?
అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్మీ పార్వతి అనూహ్య వ్యాఖ్యలు చేయడం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎలాంటి సందర్భం అయినా చాలా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడే లక్ష్మిపార్వతి ఇంత దూకుడుగా మాట్లాడుతున్న తీరుపై పార్టీ శ్రేణుల్లో కొత్త టాక్ వినిపిస్తుంది. ఆమె చేస్తున్న విమర్శల తీరు చూసి లక్ష్మీ పార్వతి లో చాలా మార్పు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరైతే మంత్రి పదవి ఆశిస్తున్నారేమో, ఎమ్మెల్సీగా అవకాశం కోసం చూస్తున్నారేమో అని లక్ష్మీ పార్వతి నుద్దేశించి చర్చిస్తున్నారు.

దూకుడు చూపించే నేతల సరసన లక్ష్మీ పార్వతి
లక్ష్మీపార్వతి కూడా రేసులో ముందుకు వస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆమె మంత్రిపదవి ఆశిస్తే తప్పేంటి అని అడుగుతున్న వారు కూడా లేకపోలేదు. ఇప్పటివరకు అకాడమీ చైర్మన్ గా ఏం చేశారని, ఇప్పుడు ఆమెకు మరో అవకాశం ఇవ్వటానికి అని చర్చిస్తున్న వారు కూడా ఉన్నారు. చంద్రబాబు లోకేష్ ను, టార్గెట్ చేయడంలో దూకుడు చూపించే నేతల సరసన ఆమె కూడా చేరుతున్నారా అని చర్చిస్తున్నారు. అయితే తనకు మంత్రి పదవి పై ఎలాంటి ఆపేక్ష లేదని, జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తించడమే తన విధి అని గతంలో అనేక మార్లు లక్ష్మీపార్వతి చెప్పిన విషయం తెలిసిందే. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా పరుషంగా లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులలోనూ , రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.