తిరుమలలో కార్తీక పౌర్ణమి వేడుకలు

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 77,844 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 20,486 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. ప్రస్తుతం వైకుంఠం కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉండనక్కర్లేదు. క్యూలైన్ల ద్వారా నేరుగా దర్శనానికి వెళ్లవచ్చు.

Llist of the festivals and auspicious days to be held in Tirumala in the month of November 2024

తిరుమలలో నవంబర్‌లో జరిగే పండగలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. కార్తీక పౌర్ణమి గరుడ సేవ, కైశిక ద్వాదశి, కేదార గౌరీవ్రతం వంటి ఉత్సవాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా రోజుల్లో శ్రీవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు, సేవలను నిర్వహిస్తారు టీటీడీ అర్చకులు.

నవంబరు 1వ తేదీన కేదారగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. 3వ తేదీన భగినీహస్త భోజనం కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీ తిరుమలనంబి శాత్తుమొర కార్యక్రమాన్ని అదే రోజున ఏర్పాటు చేస్తారు. 5వ తేదీన నాగుల చవితి, అదే రోజున పెద్ద శేష వాహన సేవలు ఉంటాయి. శ్రీమలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు.

నవంబరు 6వ తేదీన శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర పర్వదినాన్ని నిర్వహిస్తారు. 8వ తేదీన వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ చేస్తారు టీటీడీ అర్చకులు. 9వ తేదీన శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర కార్యక్రమాలు ఉంటాయి.

నవంబర్ 10వ తేదీన పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి ఉత్సవాలను జరుపుతారు. 13వ తేదీన కైశిక ద్వాదశి సందర్భంగా ప్రత్యేకంగా ఆస్థానం, అదే రోజున చాతుర్మాస్య వ్రత సమాప్తి ఉత్సవాలను నిర్వహిస్తారు.

⁠నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా పౌర్ణమి గరుడసేవను కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ⁠నవంబర్ 28వ తేదీన ధన్వంతరి జయంతి, ⁠29న మాస శివరాత్రితో నవంబర్ నెలలో జరగబోయే విశేష ఉత్సవాలు ముగుస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+