వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో లాక్ డౌన్ , నైట్ కర్ఫ్యూ ల టెన్షన్ ... క్లారిటీ ఇచ్చిన వైద్య శాఖా మంత్రి ఆళ్ళ నాని

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో, రోజువారీ కేసులు పెరుగుతున్న తరుణంలో, ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అంటే ఆంక్షలు మళ్లీ విధిస్తారేమో అన్న ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయపెడుతున్నాయి. అయితే తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో తాజా పరిస్థితిపై, లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలపై జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

corona cases in andhrapradesh : స్పీడందుకున్న కేసులు, తాజాగా 2,558 కేసులు ,6 మరణాలుcorona cases in andhrapradesh : స్పీడందుకున్న కేసులు, తాజాగా 2,558 కేసులు ,6 మరణాలు

ప్రభుత్వానికి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన లేదు

ప్రభుత్వానికి లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన లేదు

అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ ఎక్కడ కేసులు తీవ్రంగా ఉంటే అక్కడ కరోనా కట్టడికి చర్యలు చేపడతామని, అంతే తప్ప లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్న ఆళ్లనాని , కరోనా కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

 కరోనా నియంత్రణ కోసం ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి

కరోనా నియంత్రణ కోసం ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి

కరోనా ఆసుపత్రులను, కోవిడ్ కేర్ సెంటర్లను, బెడ్ ల సంఖ్యను పెంచాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులను ఆదేశించారు అని చెప్పిన మంత్రి ఆళ్ల నాని , ప్రజలు కూడా తమ బాధ్యతగా కరోనా కట్టడి చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో కరోనా నియంత్రణ కోసం జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశామని తెలిపారు . చాలామంది ప్రజలు కరోనా నిబంధనలను పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం అసలే పాటించడంలేదని, శానిటైజేషన్ గురించి మరిచిపోయారని పేర్కొన్న ఆయన ప్రజలలో నిర్లక్ష్యం ఉంటే కరోనా కట్టడి కష్టమవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత లేదు.. వ్యాక్సినేషన్ కు ముందుకు రావాలి

రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత లేదు.. వ్యాక్సినేషన్ కు ముందుకు రావాలి

చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని, వ్యాక్సిన్ పట్ల అపోహలు వదిలేసి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆళ్ల నాని సూచించారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదని, ఏపీ వ్యాప్తంగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చేందుకు 3.80 లక్షల డోసులు రెడీగా ఉన్నాయి అని చెప్పారు. ఇక మరో రెండు రోజుల్లో రెండు లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసులు కేంద్రం నుంచి రానున్నాయని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూల ఆందోళనను పక్కనపెట్టి కరోనా సెకండ్ వేవ్ ను ఫేస్ చెయ్యండి

లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూల ఆందోళనను పక్కనపెట్టి కరోనా సెకండ్ వేవ్ ను ఫేస్ చెయ్యండి

లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూలు విధిస్తారు అన్న ఆందోళనను పక్కనపెట్టి కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ప్రజలంతా పోరాటం సాగించాలని, కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు లేకుండా బయట తిరగవద్దు అని మంత్రి ఆళ్ల నాని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసరంగా బయట తిరగొద్దు అంటున్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులను సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు కావాల్సిన సూచనలు అందిస్తున్నారు.

English summary
Jagan Sarkar clarified on lock down and night curfews, said that there is no such idea. Health Minister and Deputy CM Alla Nani said the government had no plans to impose lock-down and night curfews . Alla nani, said that corona cases were on the rise, made it clear that the government was ready to fight with corona. Officers have already been instructed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X