వైసీపీ నేతల భూ కబ్జాలతో అనంత రైతు కుటుంబం ఆత్మహత్యా యత్నం ; లోకేష్ ఆగ్రహం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతున్న అక్రమాలపై, అరాచకాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రికార్డులు మార్చేసి రైతుల భూమి కాజేసి ఏపీలో విచ్చలవిడిగా భూకబ్జాలు జరుగుతున్నాయని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేష్ అనంతపురం జిల్లాలో ఆత్మహత్యా యత్నం చేసిన రైతు లక్ష్మిరెడ్డి పరిస్థితిపై పోస్ట్ చేశారు.
వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అనంతపురం జిల్లా అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి గారి కుటుంబం మొత్తం వారికి జీవనమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది.(1/2) pic.twitter.com/cIZq8aw0W2
— Lokesh Nara (@naralokesh) October 4, 2021

వైసీపీ కబ్జాల దెబ్బకు పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసిన రైతు కుటుంబం
భూ కబ్జాదారులకు అధికారులు సహకరిస్తుంటే సామాన్య ప్రజల గతి ఏంటి అంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. వైసిపి నాయకులు భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని అనంతపురం జిల్లా అక్కంపల్లి కి చెందిన రైతు లక్ష్మి రెడ్డి కుటుంబం మొత్తం వారికి జీవనాధారమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేశారంటే వైసిపి దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ స్థానిక నేతలు, అధికారులు కుమ్మక్కై రైతుల భూమి కొట్టేయాలని కుట్రలు చేయడం దారుణం అంటూ లోకేష్ పేర్కొన్నారు. దీని వెనుక వున్న అసలు సూత్రధారులను శిక్షించి రైతు లక్ష్మి రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

గాంధీ జయంతి నాడు దళితులపై దాడులపై భగ్గుమన్న లోకేష్
ఇప్పటికే నిత్యం అనేక అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఏపీలో అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తున్న లోకేష్ మొన్నటికి మొన్న గాంధీ జయంతి రోజు రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదని దళితుల తల పగలగొట్టి మరీ చెప్పారు వైసీపీ నేతలు అంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరి పేటలో దళితులపై వైసీపీ నేతల దాడి జరిగిందంటూ, ఆ దాడి విజువల్స్ ను పోస్ట్ చేసిన లోకేష్, వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు.

భూఆక్రమణలకు పాల్పడుతున్న వైసీపీ నేతలపై చర్యలకు డిమాండ్
విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని దళితులపై దాడికి తెగబడిన వైసిపి నాయకులను కఠినంగా శిక్షించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, ఎక్కడ చూసినా హింస చోటు చేసుకుంటుందని, ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు తెగబడుతున్నారు అని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

వైసీపీని తూర్పారబడుతున్న టీడీపీ
రాష్ట్రాన్ని అభివృద్ధి శూన్యంగా తయారు చేస్తున్నారని, అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా , డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా, నేరాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మారుస్తున్నారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెట్రేగి పోతోందని, డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, పరిశ్రమలు రాకుండా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా ముంచుతున్నారు అని ధ్వజమెత్తుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైన దాడులకు తెగబడ్డారని, వైసిపి గుండాల తీరుతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని పదే పదే విమర్శిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications