నాడు ప్రవచనాలు చెప్పిన జగన్ రెడ్డీ ... వైసీపీ పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలు : లోకేష్ బహిరంగ లేఖ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై బహిరంగ లేఖ రాశారు. జగన్ సర్కారు హయాంలో ఏపీలో విద్యుత్ రంగం పూర్తిగా దెబ్బతిందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ వినియోగదారులకు భారంగా మారిన ట్రూ అప్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని పేర్కొన్న లోకేష్ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయింది అని దానిని గాడిలో పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి ప్రస్తుతం ఉందని అభిప్రాయపడ్డారు.

టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచకపోయినా జగన్ రెడ్డి దీర్ఘాలు
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతి సభలోనూ చెప్పారని, ఆనాడు జగన్ చెప్పిన మాటలు నేటికి ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. మరి అలాంటి జగన్ రెడ్డి ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలను ఈ రకంగా బాదటం ఏమిటని ప్రశ్నించారు. ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఒక్క సారి కూడా చార్జీలు పెంచక పోయినా విద్యుత్ చార్జీల బాదుడు అంటూ రోజుకో రకంగా అసత్య ప్రచారం చేస్తూ జగన్ రెడ్డి దీర్ఘాలు తీశారని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి అంటూ నిలదీశారు

సీఎంగా ప్రమాణం చేసిన రోజున విద్యుత్ ఒప్పందాల గురించి జగన్ రెడ్డి ప్రవచనాలు
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున జగన్ రెడ్డి ప్రవచనాలు చెప్పారని కరెంటు చార్జీల గురించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అవన్నీ అబద్ధాలని నిరూపించారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ఇప్పటికి ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాలని, ఏడవ సారి కూడా విద్యుత్ చార్జీలను పెంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు నారా లోకేష్. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఏ ఒక్క రోజు సక్రమంగా విద్యుత్ సరఫరా కాలేదని, కానీ కరెంటు బిల్లుల మోత మాత్రం మోగుతుంది అంటూ మండిపడ్డారు.

పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ మీద కూడా జగన్ సర్కార్ అప్పులు
ఆరు విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీల భారం 11,611 కోట్లు అంటే ప్రజలపై ఎంతగా చార్జీల భారం మోపారో అర్థమవుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఫీజులు పీకుతామంటూ బెదిరిస్తూ వసూలు చేస్తున్న కరెంట్ బిల్లులు వసూళ్లు సరిపోక, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీద అప్పులు కూడా తీసుకున్నారంటూ మండిపడ్డారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26,262 కోట్లు అప్పులు తీసుకుని, ఈ భారాన్ని కూడా విద్యుత్ వినియోగదారులపై మోపుతున్నారంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు ఇలా .. కానీ ఏపీలో మాత్రం ఇలా
అంతులేని అవినీతి తగ్గించుకుంటే పేదలకు నాణ్యమైన విద్యుత్ ను కరెంట్ చార్జీలు పెంచకుండానే అందించవచ్చని పేర్కొన్న లోకేష్ దేశ వ్యాప్తంగా విద్యుత్ యూనిట్ ధర రూ.3.12 పైసలకే వస్తుంటే, జగన్ సర్కార్ మాత్రం గరిష్టంగా యూనిట్ 20 రూపాయలకు కొనుగోలు చేస్తుందని, అలా ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని లేఖ ద్వారా లోకేష్ డిమాండ్ చేశారు. ఒక్కో యూనిట్ కి అదనంగా 16 రూపాయలకు పైగా చేస్తున్న ఖర్చు ఎవరి జేబుల్లోకి వెళుతుందో చెప్పాలంటూ లోకేష్ నిలదీశారు.

సామాన్య ప్రజలకు శరాఘాతంగా కరెంట్ చార్జీల దోపిడీ
రాష్ట్రంలో సామాన్య ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారని, విద్యుత్ ఛార్జీల పేరుతో మీ నిలువు దోపిడీ భరించలేకపోతున్నారని లోకేష్ జగన్ సర్కార్ కరెంట్ బిల్లుల బాదుడును పేర్కొన్నారు. కరెంట్ చార్జీలు దోపిడి శరాఘాతంలా సామాన్య ప్రజలకు తగులుతోంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ లకు చెల్లించాల్సిన 12 వేల కోట్ల రూపాయలు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించాల్సిన 10,800 కోట్ల రూపాయలను చెల్లిస్తే విద్యుత్ రంగం కుప్పకూలింది దుస్థితి వచ్చేది కాదని, వెంటనే ఆ బకాయిలు చెల్లించి శంషాబాద్ లో పడిన విద్యుత్ రంగాన్ని పునరుద్ధరించాలని లోకేష్ లేఖ ద్వారా కోరారు.

ట్రూ అప్ చార్జీలతో మరో బాదుడు నిర్ణయం మానుకోవాలి
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, ట్రూ అప్ చార్జీలతో మరోసారి బాదుడుకు రెడీ అవుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని లోకేష్ సూచించారు. కేవలం ఒక బల్బు, ట్యూబ్ లైట్, ఫ్యాన్ ఉన్నవాళ్లే వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తుందని లబోదిబోమని వాపోతుంటే దీనిపై అధికారులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించడం లేదని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను విద్యుత్ చార్జీల భారంతో ఇబ్బంది పెట్టొద్దని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. వైసిపి పాలనలో విద్యుత్ కోతలు బిల్లుల వాతలు అంటూ విరుచుకుపడిన లోకేష్ ప్రజలకు భారంగా మారిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Recommended Video

ఏపీలో విద్యుత్ కొరత తీవ్రంగా .. ప్రజలు కరెంట్ వాడకం తగ్గించాలన్న సజ్జల
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇళ్ళల్లో కరెంటు వాడకాన్ని తగ్గించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రతిరోజు రాత్రి 6 గంటల నుండి 10 గంటల మధ్య విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన ప్రజలకు సూచించారు. బొగ్గు కొరత ధరల పెరుగుదల వల్ల ఈ సమస్య వచ్చిందని ఇది డబ్బుతో పరిష్కారమయ్యే సమస్య కాదని సజ్జల అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి చెప్పిన దాంట్లో వాస్తవం లేదని పేర్కొన్న ఆయన భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు విధించాల్సి న పరిస్థితి రావచ్చు అంటూ హెచ్చరించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications