పోలవరం నిర్వాసితుల సమస్యలపై జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్; ఆ హామీలు ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని నారా లోకేష్ ఆ లేఖ ద్వారా జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారని లోకేష్ లేఖ ద్వారా స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ సూచించారు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరం బాధితులకు జగన్ ఇచ్చిన హామీలను ప్రశ్నించిన లోకేష్
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామాలలో పర్యటించి, పోలవరం నిర్వాసితులకు హామీలు ఇచ్చారని లోకేష్ గుర్తు చేశారు. ప్రతి ఎకరానికి 12 లక్షలు ఇస్తానని ఓసారి, 10 లక్షలు ఇస్తానని మరోసారి చెప్పి జగన్ మాట మార్చారని లోకేష్ మండిపడ్డారు. భూమి లేని వారికి పది లక్షల ప్యాకేజీ ఇస్తానని, వలస వెళ్లిన వాళ్లకి కూడా ప్యాకేజీ అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారని సీఎం అయిన తర్వాత జగన్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని లోకేష్ పేర్కొన్నారు.

Lokesh targeting Jagan on Polavaram victims issues; open letter on those assurances

పరిహారం విషయంలో జగన్ మోసం చేశారని ఆరోపణ
ఎకరానికి 1.15 లక్షల పరిహారం ఇచ్చిన భూములకు ఐదు లక్షలు ఇస్తానని, జగన్ చెప్పారని ఇక 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా పరిహారం ప్యాకేజీ ఇస్తానని నాడు చెప్పిన జగన్, ఇప్పుడు ఆ హామీలను విస్మరించారని గుర్తుచేశారు. అంతేకాదు 25 రకాల సౌకర్యాలతో నిర్వాసితులు అందరికీ అన్ని వసతులతో కాలనీలు నిర్మిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని నాడు బహిరంగ సభలో మీరు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని లోకేష్ డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల 275 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో అరకొరగా మాత్రమే పరిహారం అందించాలని లోకేష్ పేర్కొన్నారు.

పోలవరం నిర్వాసితుల సమస్య చిన్నదైతే మంత్రులు పరిష్కారం చెయ్యటం లేదేం
కాంటూర్ నిర్వాసితుల పరిహారానికి కేవలం 550 కోట్లు విడుదల చేశారని అందులోనూ వంద కోట్ల మింగేయడం చాలా దారుణమని లోకేష్ ఆరోపణలు గుప్పించారు. పోలవరం నిర్వాసితుల సమస్య చిన్నది అంటున్న మంత్రులు దాని పరిష్కారానికి చిన్న ప్రయత్నం కూడా చేయడం లేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పోలవరం ముంపు గ్రామాలలో రెండు రోజుల పాటు పర్యటించారు. ముంపు బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

పోలవరం ముంపు గ్రామాల్లో ఇటీవల లోకేష్ పర్యటన .. జగన్ పై ఫైర్
పోలవరం ముంపు గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాచలం, టేకుల బోరు, శ్రీరామగిరి, చింతూరు, దేవీపట్నం, రంపచోడవరం, పెద్ద వేంపల్లి, కృష్ణుని పాలెం, ఇందుకూరు ,ముసిరి గుంట, ప్రాంతాలలో లోకేష్ పర్యటించారు. జగన్ సర్కారు తీరు పై విరుచుకుపడ్డ లోకేష్ మోసపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి నిలువునా మోసపోయారని, ఇస్తామన్న ప్యాకేజీ ఇవ్వకుండా బెదిరించి ఊళ్ళన్నీ ఖాళీ చేయిస్తున్నారని, నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని లోకేష్ అప్పుడు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్ళీ పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని లోకేష్ జగన్ కు లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+