విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్..!
ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ గొడవలు పడుతున్న సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితమే తన సోదరుడు ఇంటికి వెళ్లి ఎలా దాడిచేస్తాడో చూడండంటూ ఒక వీడియోను మనోజ్ షేర్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆ వీడియో సంచలనం కలిగించింది. తన మనిషి సారథిపై దాడిచేస్తున్నాడంటూ మనోజ్ తెలిపారు. అయితే దీనిపై మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ పాజిటివ్ గానే స్పందించారు.
ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సహజంగానే జరుగుతుంటాయని, పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ లైట్ తీసుకున్నారు. ఇద్దరిమ మధ్య చిన్నచిన్న గొడవలున్నాయని, అది మాములేనని మోహన్ బాబువ్యాఖ్యానించారు. వీడియో షేర్ చేసిన తర్వాత మనోజ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. తాజాగా రియల్ స్టార్ శ్రీహరి కొడుకు 'మేఘాన్ష్' కొత్త సినిమా ఓపెనింగ్ కి మంచు మనోజ్ అతిథిగా వచ్చారు. దర్శకుడు బాబీ, టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీతో కొంత సమయం గడిపిన మనోజ్ ఒక ఫొటోను షేర్ చేశారు.

మంచు విష్ణుతో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడమనగా.. తాను కొత్త జీవితాన్ని ప్రారంభించానని, అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు. సినిమాల్లోకి మళ్లీ వస్తున్నానని, అందుకు అందరి మద్దతు కావాలన్నారు. ప్రస్తుతం మంచు కుటుంబంలో అన్నదమ్ములను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీడియో షేర్ చేసిన రోజు కూడా మోహన్ బాబు మనోజ్ పై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ఫోన్ చేసిన తర్వాత మనోజ్ ఆ వీడియోను డిలిట్ చేశారు.
ఇటీవలే మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కూడా మంచు విష్ణు ఒక అతిథిలా వచ్చి వెళ్లారు. వీరి సోదరి మంచు లక్ష్మీ దగ్గరుండి పెళ్లి బాధ్యతలు చూశారు. తన భార్య రాజకీయాల్లోకి వెళతానంటే తాను అభ్యంతరం తెలపనని, ప్రోత్సహిస్తానని మనోజ్ అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications