జయజానకీ నాయక చిత్రం: బోయపాటిపై బుద్ధప్రసాద్ ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: జయజానకీ నాయకా చిత్రంంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ప్రశంసల జల్లు కురిపించారు. పవిత్ర సాగర సంగమక్షేత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని ఆయన అన్నారు.

ఈ సినిమా ద్వారా దివిసీమకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖ దర్శకుడు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా నటించిన జయ జానకి నాయక చిత్రంలోని పలు సన్నివేశాలను సాగర సంగమంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. దాన్ని అవనిగడ్డలోని వెంకటేశ్వర థియేటర్‌లో బుద్ధప్రసాద్‌ చూసారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలిసే అవకాశం...

తెలిసే అవకాశం...

సాగర సంగమం దృశ్యాలు, దివిసీమ విశిష్టత బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జయజానకి నాయక సినిమాద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే అవకాశం లభించిందని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దివిసీమ ఔన్నత్యాన్ని చాటిచెప్పే ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగశాస్త్రి రచించిన శ్లోకం అద్భుతంగా ఉందని కొనియాడారు.

AP Deputy Speaker praised Jaya Janaki Nayaka film
బోయపాటికి కృతజ్తతలు...

బోయపాటికి కృతజ్తతలు...

జయ జానికి చిత్రం విడుదల ద్వారా పర్యాటక స్థలంగా దివిసీమ మరింత ప్రాచుర్యం పొందుతుందని మండలి బుద్ధప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. దివిసీమలో సినిమాను చిత్రీకరించిన దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో సాయిశ్రీనివాస్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆయనతో కలిసి వారంతా...

ఆయనతో కలిసి వారంతా...

అవనిగడ్డ, మోపిదేవి ఎంపీపీలు బి.కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి, అవనిగడ్డ జడ్పీటీసీ సభ్యుడు కె.వెంకటేశ్వరరావు, దివి గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ (రాజా), స్వచ్ఛ అవనిగడ్డ సొసైటీ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ ఎం.శ్రీనివాసరావు, లంకమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ శ్రీరాములు, కనకదుర్గ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యురాలు విశ్వనాథపల్లి పాప చిత్రాన్ని బుద్ధప్రసాద్‌తో కలిసి చూశారు.

హంసలదీవి ఇలా....

హంసలదీవి ఇలా....

హంసలదీవిలో తెరకెక్కించిన సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుంది. లెక్కకు మించిన యాక్షన్‌ సన్నివేశాలతో తెరపై అధిక భాగం ఫైట్లకే పరిమితం చేసినా, దాని చుట్టూ ఎమోషన్‌ సన్నివేశాలు ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh assembly speaker Mandali Budha Prasad praised Boyapati Srinivas's Jaya Janaki Nayaka Telugu fim.
Please Wait while comments are loading...