త్రిష, చిరంజీవి, ఖుష్బూలపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీ ఖాన్!!
సినీ ఇండస్ట్రీలో త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినిమా పరిశ్రమలో దుమారం రేగగా, త్రిష మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. త్రిష కు మద్దతుగా చిరంజీవి, ఖుష్బూ, లోకేష్ కనగరాజ్, నటి మాళవిక మోహన్, చిన్మయి, హీరో నితిన్ తదితరులు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అయితే తాజాగా ఈ వ్యవహారంలో మన్సూర్ అలీ ఖాన్ త్రిష, ఖుష్బూ, చిరంజీవిల పై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన అడ్వకేట్ ధనుంజయన్ ద్వారా పరువు నష్టం దావా వేసిన మన్సూర్ అలీ ఖాన్ తనకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. ఇక మన్సూర్ అలీఖాన్ వేసిన పిటిషన్లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు.

దీంతో ఈ కేసు డిసెంబర్ 11వ తేదీన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ లియో చిత్రం గురించి మాట్లాడుతూ, లియో చిత్రంలో నేను చేసే సన్నివేశాలలో ఒక సన్నివేశం కూడా త్రిషతో చేయలేదని, ఒక బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నానన్నారు.
అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్ రూమ్ కి తీసుకు వెళ్లవచ్చని అనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. ఇంతకుముందు చాలా సినిమాలలో తాను రేప్ సీన్లు చేశానని, కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదు అంటూ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు.
ఇక ఈ వ్యాఖ్యలకు మండిపడిన త్రిష తన కెరీర్లో మిగతా సినిమాలలో అతను లేకుండా ఉండేలా చూసుకుంటానని, స్త్రీలను అగౌరవించే విధంగా, లైంగికంగా వేధించే విధంగా, అసహ్యంగా అతని మాటలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక త్రిష వ్యాఖ్యలకు మద్దతునిస్తూ చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు నటులు మన్సూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నడిగర్ సంఘానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో నడిగర్ సంఘం మన్సూర్ అలీఖాన్ పై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే మన్సూర్ అలీఖాన్ తను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని, తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదం నేపధ్యంలో ఆయన పరువు నష్టం దావా వేశారు.












Click it and Unblock the Notifications