Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేటినుండి మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు; ఏజెన్సీప్రాంతాలలో నేతలకు భద్రత పెంపు, అల్లూరిజిల్లాలో హై అలెర్ట్

జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు .. అడుగడుగునా జల్లెడ పడుతున్న పోలీసులు

మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు .. అడుగడుగునా జల్లెడ పడుతున్న పోలీసులు


పెదబయలు-కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి వంతల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్ అరెస్ట్ కావడంతో ఈ ఏడాది అమరవీరుల వారోత్సవాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారని అనుమానం ఉన్న నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు

మావోయిస్ట్ నేత అశోక్ అరెస్ట్ తో ప్రాబల్యం తగ్గిందని భావిస్తున్న పోలీసులు... అయినా

మావోయిస్ట్ నేత అశోక్ అరెస్ట్ తో ప్రాబల్యం తగ్గిందని భావిస్తున్న పోలీసులు... అయినా

అశోక్ అరెస్టుతో 33 మంది పార్టీ సభ్యులు మరియు 27 మంది మిలీషియా సభ్యులతో సహా 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అశోక్ అరెస్ట్ తో పాటుగా, పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తగ్గిపోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గినట్టే నని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గతంలో మావోయిస్టులు కనిష్ట స్థాయికి చేరినప్పుడల్లా మరో పెద్ద సంఘటనలతో మావోయిస్టులు పునరాగమనం చేసేందుకు ప్రయత్నించడం అనేక సందర్భాల్లో కనిపించింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్లీ మావోయిస్టులు పంజా విప్పుతారు అన్న అనుమానంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

గతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన మావోలు

గతంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన మావోలు

2018 సెప్టెంబర్‌లో డుంబ్రిగూడ మండలం లివిటిపుట్‌లో టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేశారు. 2016లో రామగూడలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత 30 మందికి పైగా మావోయిస్టులు మరణించిన తరువాత మావోయిస్టులు తక్కువగా ఉన్నారని భావిస్తున్న సమయంలో ఇది జరిగింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య పోలీసులకు ఒక షాకింగ్ పరిణామంగా మారింది.

మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేసే అవకాశం.. అందుకే కూంబింగ్

మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేసే అవకాశం.. అందుకే కూంబింగ్

ఇక తాజాగా మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికి కోసం, ఏదైనా చర్యకు పాల్పడతారని జిల్లా పోలీసులు ఏపీఎస్పీ, సివిల్ మరియు గ్రేహౌండ్స్ వంటి అన్ని విభాగాల నుండి మరిన్ని బలగాలను రంగంలోకి దింపారు. కూంబింగ్ ఆపరేషన్లు, ఏరియా ఆధిపత్య కసరత్తులు ముమ్మరం చేశారు. అన్ని కీలక పాయింట్ల వద్ద, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బాంబు మరియు డాగ్ స్క్వాడ్‌ల ద్వారా పేలుడు పదార్థాలు కోసం కూడా తనిఖీ చేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే ప్రజా ప్రతినిధులకు భద్రత పెంపు

ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే ప్రజా ప్రతినిధులకు భద్రత పెంపు


అంతేకాదు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో, ఏజెన్సీ లో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది అని, వారిలో కొందరికి భద్రతను కూడా పెంచామని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ వెల్లడించారు. ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత మండలాలైన పెదబయలు, చింతపల్లి, జీకే వీధిలో అన్ని కీలకమైన ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ తుషార్ దూది తెలిపారు.

మావోయిస్ట్ అగ్రనేత అరుణ రాక.. ఏఓబీలో టెన్షన్

మావోయిస్ట్ అగ్రనేత అరుణ రాక.. ఏఓబీలో టెన్షన్

ఇదిలా ఉంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ ఇన్‌చార్జి అరుణ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ రీజియన్‌కు తిరిగి వచ్చినట్లు పలు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. గత జూన్‌లో కొయ్యూరులో తీగలమెట్ట ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్ వంటి అగ్రనేతలు చాలా మంది 'సురక్షిత ప్రాంతాలకు' వెళ్లినట్లు నిఘా వర్గాలు కొన్ని నెలల క్రితం ధృవీకరించాయి. ఏఓబీ రీజియన్‌ కమాండ్‌ కోరా నాగేశ్వరరావు, అశోక్‌లకు ఇవ్వగా, ఇద్దరినీ అరెస్టు చేశారు. ఇది ఆ ప్రాంతంలో పార్టీకి నాయకులను లేకుండా చేస్తుంది. దీంతో అరుణ తిరిగి రావడం ఆ శూన్యతను పూరించడానికి ఒక ఎత్తుగడగా భావించవచ్చు. స్థానిక బలం బాగా తగ్గిపోవడంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొద్దిమంది కేడర్‌తో అరుణ తిరిగి వచ్చినట్లు సమాచారం.

చారు మజుందార్ వర్దంతి సందర్భంగా మావోయిస్ట్ అమరుల వారోత్సవాలు

చారు మజుందార్ వర్దంతి సందర్భంగా మావోయిస్ట్ అమరుల వారోత్సవాలు

ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన చారు మజుందార్ వర్ధంతిని పురస్కరించుకుని మావోయిస్టులు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. చారుమజుందార్ జూలై 28, 1972 న పోలీసు కస్టడీలో మరణించాడు.మావోయిస్టు అమరవీరుల సంస్మరణార్ధం జులై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు వారం రోజుల పాటు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+