14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మృతుల సంఖ్య 14 కు చేరింది . ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, తాజాగా ఒకరు మృతి చెందారు.
నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తుండగా ప్రమాదం
క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

మోడీ, చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటన
13మంది సజీవ దహనం కావటం అత్యంత విషాదకరమన్నారు. క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి బాబు కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
క్యాబినెట్ లో బస్సు ప్రమాదంపై చర్చ.. పరిహారం ఇలా
బస్సు ప్రమాద ఘటనపై ఏపీ క్యాబినెట్లో చర్చ జరగగా మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యాన్ని కూడా పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు.
బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి, రాష్ట్రమంత్రి
ఇదిలా ఉంటే తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.












Click it and Unblock the Notifications