జగన్ పై ఆ కేసు పెట్టి జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలిసి వారిని పరామర్శించడంతో పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జగన్ మిర్చి యార్డుకు వెళ్లి న్యూసెన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కు రైతులపై ప్రేమ ఉందా: మంత్రి బాల వీరాంజనేయ స్వామి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైలులో ఉంటే జగన్ వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఇక గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నాడని, గత ప్రభుత్వ హయాంలో రైతులను అడుగడుగున మోసం చేశారన్నారు.

పోలీసులపై జగన్ అనుచిత వ్యాఖ్యలు దారుణం
రైతు భరోసా నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో రైతులను జగన్ ఇబ్బంది పెట్టాడని, అటువంటి జగన్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, అన్ని విధాల జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే ప్రజలు 11సీట్లు ఇచ్చి అధికారం నుంచి దూరం చేశారని తెలిపారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.
జగన్, ఆయన అనుచరులను జైలుకు పంపాలి
సప్త సముద్రాలు దాటి వచ్చి అయినా అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామని జగన్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. సప్త సముద్రాలు జగన్ దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆయనకు ఆ శక్తి లేదని జగన్ పని అయిపోయిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ కు మళ్ళీ అధికారం అందని ద్రాక్ష అంటూ మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్ ను ఆయన అనుచరులను కేసు పెట్టి జైలుకు పంపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications