గాడిదకేం తెలుసు గంధపు వాసన: నాగబాబుకు రోజా కౌంటర్!!

నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజాపై, జనసేన పార్టీ నాయకుడు, పిఏసి సభ్యుడు కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా వేసిన సెటైర్ లకు రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు . ఓ గ్రామంలో తాగునీటి ట్యాంకు ప్రారంభించి బిందెలలో మహిళలకు నీళ్లు పడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రోజా హంద్రీనీవా సుజల స్రవంతిని ప్రారంభించారని నాగబాబు ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి రోజా నాగబాబుపై రివర్స్ అటాక్ చేశారు.

నాగబాబుకు రివర్స్ పంచ్ ఇచ్చిన రోజా

వాటర్ ట్యాంకు దగ్గర రోజా హడావుడికి సంబంధించి నాగబాబు పేల్చిన వ్యంగ్యాస్త్రాలకు సమాధానం ఇచ్చిన రోజా ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సుదూర ప్రాంతం నుండి పైప్ లైన్ లాగి తాగునీటినిచ్చాము. నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల బాధలు తీర్చాము అని పేర్కొని, నాగబాబు ను ఉద్దేశించి గాడిద కేమి తెలుసు గంధపు వాసన అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. తాను కాబట్టి వివరాలన్నీ చూపిస్తున్నానంటూ, ఆ గ్రామానికి తాగునీటి పైప్లైన్లు రావడం కోసం చేసిన పనుల వివరాలను వెల్లడించారు. ఇక నాగబాబు తాను ఏ గ్రామానికి అయితే నీళ్లు ఇచ్చానో ఆ గ్రామానికి వెళ్లి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు.. అక్కడి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని మంత్రి రోజా నాగబాబు కు కౌంటర్ ఇచ్చారు.

 రోజాపై నాగబాబు సెటైర్లు

రోజాపై నాగబాబు సెటైర్లు

ఇదిలా ఉంటే నిన్న మంత్రి రోజా హంద్రీనీవా సుజల స్రవంతిని ప్రారంభించిందని, తాను చేసిన ఈ కార్యక్రమం ద్వారా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చారని ఒక ఫోటోను పోస్ట్ చేసి సెటైర్లు వేశారు.రాయలసీమ జిల్లాలప్రజలదాహార్తిని తీర్చిన వైసీపీ(మాయ)పార్టీ నాయకురాలు రోజాఅంటూ ఆయన రోజాను టార్గెట్చేశారు. ఇక రోజా ప్రారంభించిన ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందినట్లు సమాచారంఅంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఇక దీనికి ఆయన ఒక చిన్న వాటర్ ట్యాంక్ నుండితాగునీటిని రోజా బిందెల్లోపడుతున్న ఫోటోనుపోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు రోజా రివర్స్ పంచ్ ఇచ్చారు.

తాగునీటి బోర్ ప్రారంభం.. నాగబాబు, రోజాల మధ్య వివాదం

తాగునీటి బోర్ ప్రారంభం.. నాగబాబు, రోజాల మధ్య వివాదం

ఇటీవల మంత్రి రోజానిండ్ర మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. నిండ్ర మండలంలో మంజూరైన 11 లక్షల నిధులతో తాగునీటి బోరు మరియు పైప్లైన్లకు ఫిబ్రవరి 7వ తేదీన పూజ చేసి ప్రారంభించిన రోజా,బిందెలలో నీళ్లు పట్టిఫోటోలకు ఫోజులిచ్చారు.గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కల్గించిందనిమంత్రి రోజా పేర్కొన్నారు.ఇక పోస్ట్ తో రగిలిన నాగబాబు, రోజాల మధ్య వివాదం కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+