శవరాజకీయాలు చేసేది చంద్రబాబే; సోము వీర్రాజు పైనా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, సోము వీర్రాజుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, ఆ విషయం అందరికీ తెలుసు అని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇటీవల టిడిపి నేత చంద్రయ్య హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి హత్యా రాజకీయాలు చేస్తున్న వైసీపీ అంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే

హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే


ఈ రోజు సంక్రాంతి వేడుకలలో భాగంగా భోగి సంబరాల్లో పాల్గొన్న మంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని, చంద్రబాబు ఆలోచనలే రాక్షస ఆలోచనలు అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. చంద్రబాబు రాక్షస ఆలోచనలు భోగి మంటల్లో తగలబడాలని కోరుకుంటున్నానని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. పండుగ వేళ దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దని చంద్రబాబుకు హితవుపలికారు వెల్లంపల్లి శ్రీనివాస్.

చంద్రబాబు హయాంలో దేవాలయాలు కూలుస్తుంటే సోము వీర్రాజు ఏం చేశారు?

చంద్రబాబు హయాంలో దేవాలయాలు కూలుస్తుంటే సోము వీర్రాజు ఏం చేశారు?

చంద్రబాబు హయాంలో దేవాలయాలు కూల్చి వేస్తుంటే సోము వీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు. మత విద్వేషాలను సోము వీర్రాజు రెచ్చగొడుతున్నారని వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ పై సోము వీర్రాజు ఎందుకు మాట్లాడడం లేదని వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. వైసీపీపై రౌడీయిజం నింద వెయ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు కోరిక నెరవేరదని తేల్చిచెప్పారు. నీఛ, దరిద్ర, హత్య, కుట్ర రాజకీయాలను చేయడాన్ని చంద్రబాబు మానుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

 హత్యా రాజకీయాల సంస్కృతి టీడీపీదే

హత్యా రాజకీయాల సంస్కృతి టీడీపీదే

పల్నాడు లో జరిగిన చంద్రయ్య హత్య పై పూర్తిగా దర్యాప్తు జరుగుతోందని కానీ చంద్రబాబు దీన్ని రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చంద్రయ్య హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆయన, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని స్పష్టం చేశారు. శవ రాజకీయాలు, హత్య రాజకీయాల సంస్కృతి తెలుగుదేశం పార్టీకి ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

జగన్ ఏపీలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు

జగన్ ఏపీలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు

సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు జరుపుకోవాలని సూచించిన ఆయన సీఎం జగన్ ఏపీలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ హయాంలో సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని, అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. 32 లక్షల మందికి సీఎం జగన్ సొంత ఇంటి కలను నెరవేర్చాలని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకాన్ని అమలుచేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

టీడీపీపై, చంద్రబాబుపై మండిపడుతున్న వైసీపీ నేతలు

టీడీపీపై, చంద్రబాబుపై మండిపడుతున్న వైసీపీ నేతలు


అంతకు ముందు ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హత్య రాజకీయాలకు పేటెంట్ అంతా చంద్రబాబుదేనని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనను వైసిపికి అంటగడుతూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై జోగి రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒంటరిగా వైసీపీని ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు పొత్తుల కోసం ఆరాట పడుతున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+