భారీ కాన్వాయ్ తో అనంతపురానికి బాలకృష్ణ; జిల్లాకేంద్రంగా హిందూపురం కోసం కలెక్టర్ కు వినతిపత్రం
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు హిందూపురం జిల్లా కేంద్రం వివాదం కాస్త అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకుంది. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని ఉద్యమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించి, మౌన దీక్ష చేసిన విషయం తెలిసిందే. అనంతరం అఖిలపక్ష నాయకులతో హిందూపురం జిల్లా కేంద్రం కోసం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

భారీ కాన్వాయ్ తో అనంతపురానికి బాలకృష్ణ
ఇక తాజాగా భారీ ర్యాలీతో, అఖిలపక్ష నాయకులతో కలిసి అనంతపురం కలెక్టర్ ను కలవనున్నారు బాలకృష్ణ. అనంతపురం కలెక్టర్ కు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని వినతి పత్రం సమర్పించనున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి భారీ ర్యాలీతో, భారీ కాన్వాయ్ తో అనంతపురం బయల్దేరారు.
ఈరోజు అనంతపురంలోని జిల్లా కలెక్టర్ ను ఆయన కలవనున్నారు. ఆయనతో పాటు అఖిలపక్ష నేతలు కూడా కలెక్టర్ ను కలవనున్నారు. ఇటు చిలమత్తూరు, లేపాక్షి మండలాల నుంచి కూడా టీడీపీ నాయకులు కలెక్టరేట్ కు తరలి వెళ్లారు.

కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్న బాలకృష్ణ
హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి హిందూపురానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడానని, అలాంటి హిందూపురం ని జిల్లా కేంద్రం చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. హిందూపురం నుంచి బాలకృష్ణ భారీగా ర్యాలీగా బయల్దేరారని తెలుసుకున్న పోలీసులు అనంతపురంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
Recommended Video

అఖిల పక్ష నేతలతో కలిసి బాలయ్య హిందూపురం కోసం పోరాటం
ఇదిలా ఉంటే కలెక్టర్ కార్యాలయంలోకి ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారినే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న బాలకృష్ణ కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించుకున్నారు. బాలకృష్ణ వెంట పార్టీ నేతలతో పాటు అఖిలపక్ష నేతలు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం కోసం తాను ఎక్కడవరకైనా వెళ్తానని, ఎంతవరకైనా ఉద్యమం చేస్తానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బాలకృష్ణ ప్రకటించారు. అన్ని అర్హతలూ ఉన్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications