వైసీపీకి తలనొప్పిగా ఆ ఎమ్మెల్సీ వ్యవహారం-అటు అక్రమ సంబంధం-ఇటు గన్ లైసెన్స్..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం కాదు కానీ ఆ పార్టీని వరుసగా సమస్యలు ముసురుకుంటున్నాయి. వీటిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా ఒకటి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈసారి ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల సమయంలోనే మొదలైన ఓ వ్యవహారం ఇప్పుడు ఆయనతో పాటు వైసీపీ మెడకు చుట్టుకోబోతోంది. తాజాగా ఆయన కుమార్తెలు రోడ్డుపైకి రావడమే ఇందుకు నిదర్శనం.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య దువ్వాడ వాణితో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్య వాణికి దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో కలిసి ఉంటున్నారు. అదే సమయంలో తండ్రిని కలిసేందుకు శ్రీనివాస్ కుమార్తెలు ఆ ఇంటికి వెళ్లారు. దీంతో వీరిని శ్రీనివాస్ తో కలిసి ఉంటున్న మహిళ రానివ్వకుండా తలుపులు వేసి అడ్డుకుందని వారు ఆరోపిస్తున్నారు.

మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తాజాగా గన్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన దగ్గర గన్ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసుల్ని కలిసి దరఖాస్తు ఇచ్చారు. కొంతకాలంగా తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొందరు వ్యక్తులు తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇందులో వాస్తవాలేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడుపై టెక్కలిలో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో పార్టీ అధినేత జగన్ మౌనం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications