Mood of Andhra: ఏపీలో జనం మూడ్ ఏంటి ? ఎన్నికలొస్తే గెలిచేదెవరు ? సీట్లు ఇవే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం (NDA) అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. ఈ కాలంలో కూటమి సర్కార్ అభివృద్ది, సంక్షేమం రెండింటినీ పరుగులు తీయించేందుకు ప్రయత్నాలు చేసింది. అలాగే విపక్ష వైసీపీ (ysrcp) అధికార కూటమి తప్పిదాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్లు కూటమి, వైసీపీల్లో ఎవరిని నమ్ముతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిని గెలిపిస్తారన్న అంశంపై హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్లు ఓ సర్వే (survey)నిర్వహించారు. వీటి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి

గ్రూప్ 1 అక్రమాలపై చంద్రబాబు షాకింగ్..! ఎలక్ట్రీషియన్లతో దిద్దించారు, వాట్సాప్ లో..!
గ్రూప్ 1 అక్రమాలపై చంద్రబాబు షాకింగ్..! ఎలక్ట్రీషియన్లతో దిద్దించారు, వాట్సాప్ లో..!

జూన్ 18 నుంచి 20 వరకూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిర్వహించినట్లు చెప్తున్న ఈ సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. మూడు దశల్లో దాదాపు 2 లక్షల మంది ఓటర్లపై ఈ సర్వే నిర్వహించినట్లు ఐఐటీయన్ల గ్రూప్ చెబుతోంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ పై పూర్తి సంతృప్తిగా ఉన్న వారు 4 శాతమని, సంతృప్తిగా ఉన్న వారు 30 శాతమని, తీవ్ర అసంతృప్తిగా ఉన్న వారు 45 శాతమని ఈ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బెస్ట్ పార్టీగా కూటమికి 40 శాతం, వైసీపీకి 44.5 శాతం ఓటర్లు జై కొట్టారు. సీఎంగా జగన్ ను 44 శాతం మంది సమర్ధించగా.. చంద్రబాబును 32 శాతం మంది సమర్ధించారు. పవన్ ను 6 శాతం, లోకేష్ ను 5 శాతం సీఎంగా సమర్ధించారు.

Mood of Andhra Survey Shocking Findings on AP Voters Mood and Likely Election Winner
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?

2029లో మళ్లీ కూటమి సర్కార్ వస్తుందా అని అడిగితే రాదని 44 శాతం మంది చెప్పారు. వస్తుందని 39 శాతం మంది చెప్పారు. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణల్ని 47 శాతం మంది నమ్మతుంటే, 38 శాతం నమ్మట్లేదు. ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగితే వైసీపీకి 49 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 34 శాతం, జనసేనకు 7 శాతం ఓట్లు వస్తాయని తేలింది. కూటమిలో పార్టీలు మళ్లీ అలాగే కలిసి పోటీ చేసినా 44.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. వైసీపీకి మాత్రం 45.5 శాతం ఓట్లు వస్తున్నట్లు తేలింది. ఈ లెక్కన కూటమికి 62 సీట్లు, వైసీపీకి 83 సీట్లు రాబోతున్నాయని తేల్చారు. పొత్తు లేకపోతే మాత్రం వైసీపీకి 47 శాతం, టీడీపీకి 36 శాతం, జనసేనకు 6.5శాతం, బీజేపీకి 2.5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. దీన్ని సీట్లుగా మారిస్తే వైసీపీకి 110-112, టీడీపీకి 43-45, జనసేనకు 2-4 సీట్లు వస్తున్నాయి. మరో 20-21 సీట్లలో హోరాహోరీ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+