వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవై ఏళ్ల కల: మృత్యుంజయ్ కార్టూన్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్టు మృత్యుంజయ్ కార్టూన్ల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ కార్టూన్ల ప్రదర్శన సోమవారం సాయంత్రం రవీంద్ర భారతిలో ప్రారంభమైంది. అరవై ఏండ్ల కల - అరవై కార్టూన్లు పేరుతో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ప్రదర్శనను ప్రారంభించారు.

ఒక్క కార్టూన్ వేల అక్షరాల కన్నా శక్తిమంతమైందని రమణాచారి అన్నారు. సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి సాంస్కృతికాంశాల పట్ల అభినివేశం గలవారికి ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. మృత్యుంజయ్ గొప్ప కళాకారుడని, అంతర్జాతీయ అవార్డులు సైతం పొందినా ఏనాడూ గర్వాన్ని ప్రదర్శించలేదని నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ అన్నారు.

మృత్యుంజయ్ కార్టూన్లలో ఓ తాపత్రయం ఉంటుందని, తెలంగాణవాదం పట్ల నిబద్ధత కనిపిస్తుందని నమస్తే తెలంగాణ దినపత్రిక సిఇవో కట్టా శేఖర రెడ్డి అన్నారు. మృత్యుంజయ్ ఉద్యమాన్ని చరిత్రగా మలిచి, దాన్ని చిత్రాల్లోకి తర్జుమా చేశాడని రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకుడు కవితాప్రసాద్ అన్నారు.

నిజంగానే ఇలాగేనా...

నిజంగానే ఇలాగేనా...

తెంలగాణను ఓ మహిళగా ఊహించి, ఆమె గృహనిర్బంధంలో ఉందని చెబుతూ ఆమెను విడుదల చేయాలనే మృత్యుంజయ్ కార్టూన్

లగడపాటి పెప్పర్ స్ప్రే

లగడపాటి పెప్పర్ స్ప్రే

తెలంగాణ బిల్లు ప్రతిపాదన సందర్భంగా లగడపాటి రాజగోపాల్ లోకసభలో పెప్పర్ స్ప్రే ప్రయోగించడాన్ని మృత్యుంజయ్ ఇలా ఊహించారు.

కాకతీయ ఉత్సవాలపై

కాకతీయ ఉత్సవాలపై

వరంగల్ జిల్లాలోని కాకతీయ ఉత్సవాలకు తగిన నిధులు విడుదల చేయలేదనే జెఎసి విమర్శపై ఇలా వ్యంగ్యంగా..

శ్రీకృష్ణ కమిటీపై...

శ్రీకృష్ణ కమిటీపై...

మృత్యుంజయ్ ఊహాశక్తిగా ఇది అద్దం పడుతుంది. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయంపై ఇలా వేశాడు.

అప్పటి తెలంగాణ మంత్రులపై...

అప్పటి తెలంగాణ మంత్రులపై...

కాంగ్రెసు ప్రభుత్వ హయాంలోని తెలంగాణ మంత్రుల తీరుపై ఇలా వ్యంగ్యంగా... పక్కనే ఆత్మబలిదానాల విషాదం...

సందర్శకులు ఇలా...

సందర్శకులు ఇలా...

మృత్యుంజయ్ కార్టూన్ల ప్రదర్శనను ఇలా ఆసక్తిగా చూస్తున్నారు. కార్టూన్లలో చరిత్ర కూడా ఉంది.. దాన్ని గమనించవచ్చు.

బతుకమ్మ పండుగ..

బతుకమ్మ పండుగ..

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ తెలంగాణ ఉద్యమానికి ఓ ఆయుధంగా మారిన స్థితిలో అప్పటి కేంద్రం తీరుపై ఇలా.

కాంగ్రెసు తీరుపై ఇలా...

కాంగ్రెసు తీరుపై ఇలా...

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెసు అధిష్టానం జాప్యం చేస్తూ వచ్చిన తీరుపై దాని పర్యవసానాలపై ఇలా...

ఇలా తదేకంగా...

ఇలా తదేకంగా...

ఓ సందర్శకుడు మృత్యుంజయ్ కార్టూన్లను తదేకంగా చూస్తూ కనిపించాడు. కార్టూన్ల అర్థాలను వెతికే ప్రయత్నమన్నట్లుగా..

మోహన్ ఇలా..

మోహన్ ఇలా..

ప్రముఖ చిత్రకారుడు మోహన్ మృత్యుంజయ్ కార్టూన్లను చూస్తూ ఇలా కనిపించారు. పక్కన మృత్యుంజయ్‌ని చూడవచ్చు

మృత్యుంజయ్‌తో రమణాచారి..

మృత్యుంజయ్‌తో రమణాచారి..

కార్టూనిస్టు మృత్యుంజయ్‌తో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి, నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ, సిఇవో కట్టా శేఖర రెడ్డి కార్టూన్ల ప్రదర్శన సందర్భంగా

English summary
Cartoonist Mrityunjay exhibition is attracting the visitors at Ravindra Bharathi in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X