కుప్పం- పులివెందుల ఛైర్మన్ అభ్యర్ధులు ఫిక్స్- జగన్ కు రిటర్న్ గిఫ్ట్, అక్కడే బిగ్ ట్విస్ట్..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రిజర్వేషన్ల పైనా స్పష్టత వచ్చింది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కూటమిలో జనసేన, బీజేపీకి కేటాయించే సీట్ల పైనా క్లారిటీ ఇచ్చారు. ఏ వర్గానికి ఏ సీటు దక్కుతుందో తేలిపోయింది. ఇక... కుప్పం, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ రెండు స్థానాల్లో బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.

సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు ఇద్దరికీ కీలకంగా మారుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసారు. రెండు సీట్లు మహిళలకే దక్కనున్నాయి. కుప్పం ఎస్సీ జనరల్ కు ఖరారైనా మహిళకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పులివెందుల మహిళా రిజర్వేషన్ ఖరారైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అవకాశం లేకుండా ఏకపక్షంగా దాదాపు అన్ని స్థానాల్లో విజయం సాధించారు. తాడిపత్రి సహా మరో రెండు మాత్రం టీడీపీకి దక్కాయి. కుప్పంలోనూ వైసీపీ గెలిచింది. దీంతో.. ఇప్పుడు అదే తరహా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇందు కోసం పులివెందుల కేంద్రంగా కొద్ది రోజులుగా కీలక రాజకీయం చోటు చేసుకుంటోంది.

 జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
జనసేన -బీజేపికి దక్కే మేయర్, మున్సిపల్ సీట్లు ఫైనల్: ఎవరికి ఎక్కడ..!!
municipal-chairperson-posts-in-kuppam-pulivendula-reserved-for-women-big-fight-for-tdp-and-ysrcp

టీడీపీ - వైసీపీ పోటా పోటీ రాజకీయం వేళ

కుప్పం లో ఈ సారి టీడీపీ దాదాపు ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. అక్కడ వైసీపీ తమ అభ్యర్ధి ని బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నా.. టీడీపీ ఇక్కడ ఏకగ్రీవం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అదే విధంగా కొద్ది నెలల క్రితం జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ గెలిచింది. ఇక, ఇప్పుడు మున్సిపల్ స్థానం గెలిచి జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని టీడీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇక.. జగన్ సైతం ఇక్కడ ఇప్పటికే ఎంపీ అవినాశ్ తో పాటుగా దుష్యంత్ రెడ్డికి బాధ్యతల ను అప్పగించారు. కడప మేయర్, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ గెలిచి తీరాల్సిందేనని దిశా నిర్దేశం చేసారు. ఎవరికి రిజర్వ్ అయినా పోటీకి సిద్దంగా అభ్యర్ధులను సిద్దం చేసారు. దీంతో.. పులి వెందులలో గెలుపు అటు టీడీపీ, ఇటు వైసీపీకి కీలకంగా మారుతున్న వేళ.. తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+