ముస్లిం కుటుంబం సెల్ఫీ వీడియో ; జగన్ సర్కార్ టార్గెట్ గా చంద్రబాబు , స్పందించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వైసిపి నాయకులు తమ భూమిని కబ్జా చేసి వేధింపులకు గురి చేస్తున్నారని, వారికి అండగా మైదుకూరు సీఐ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారితో తనకు ప్రాణహాని ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్బర్ బాషా వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారంగా మారింది. ప్రతిపక్ష పార్టీ నేతలనే కాక సొంత పార్టీ కార్యకర్తలను కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

వైసీపీ నాయకుల భూకబ్జాలకు పోలీసుల వత్తాసు .. బెదిరింపులపై అక్బర్ బాషా సెల్ఫీ వీడియో
అసలేం జరిగిందంటే దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామంటూ తమ ఆత్మహత్యకు వైయస్సార్ సిపి నాయకులు, పోలీసులు కారణమంటూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి చేరేలా ఈ వీడియోని షేర్ చేయాలని వారు వేడుకున్నారు. దువ్వూరు మండలం వైసిపి నాయకులు తమ భూమిని కబ్జా చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే మైదుకూరు రూరల్ సిఐ గెలిస్తే న్యాయం జరుగుతుందని చెప్పారని, కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతర్ చేస్తూ రూరల్ సీఐ కొండారెడ్డి తమకు దాన విక్రయం ద్వారా వచ్చినటువంటి ఒకటిన్నర ఎకరాల భూమిని కబ్జా చేయాలని చూస్తున్న తిరుపాల్ రెడ్డికి సహకరిస్తూ తమ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని, తాను చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు.

48 గంటల్లో తేల్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడి
అంతేకాదు తనను తీవ్రంగా కొట్టి, తన భార్యను స్టేషన్ నుండి బయటకు గెంటి వేశాడని కన్నీరుమున్నీరయ్యారు. 48 గంటల్లో తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని వారు చెప్పారు. ఇక భూమి విషయంలో సైలెంట్ గా ఉండకుంటే తనను చంపి తన పొలంలోనే పాతి పెడతామని వైసిపి నాయకులు బెదిరిస్తున్నారని, తనను స్టేషన్లో కూర్చోబెట్టి అక్రమార్కుల పొలం సాగు చేస్తున్నారని అక్బర్ బాషా లబో దిబో మన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.

మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై స్పందించిన చంద్రబాబు .. పోలీసుల తీరుపై ఫైర్
కాపాడాల్సిన పోలీసులే వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతూ సామాన్యులపై దౌర్జన్యానికి దిగితే ఎలా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అక్బర్ బాషా కుటుంబానికి వైసీపీ నాయకులు, పోలీసులతో ఇబ్బంది ఉందని చెప్పిన నేపథ్యంలో, అక్బర్ బాషా వీడియోపై స్పందించిన చంద్రబాబు ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకో దుర్మార్గపు వార్త వినాల్సి వస్తుందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్ రెడ్డి బంధువు తిరుపాల్ రెడ్డి, ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, ఇక కొందరు పోలీసులు తమ విధులు పక్కనపెట్టి సివిల్ పంచాయతీలో తలదూర్చడం ఏపీలో సాధారణమైందని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

పోలీసులే దౌర్జన్యాలకు దిగితే సామాన్యులకు దిక్కెవరు ? చంద్రబాబు ప్రశ్న
పోలీసులు దౌర్జన్యాలకు దిగితే సామాన్యులకు దిక్కెవరు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్కౌంటర్ చేస్తామని బాధితుడు బెదిరింపులకు పాల్పడటం దారుణమని పేర్కొన్న చంద్రబాబు, అక్బర్ బాషా కుటుంబానికి తాము అండగా ఉంటామని వెల్లడించారు. గతంలో నంద్యాలలో సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఇప్పుడు అదే బాటలో అక్బర్ కుటుంబం కూడా ఆత్మహత్యకు సిద్ధపడిందని పేర్కొన్న చంద్రబాబు ప్రభుత్వం వెంటనే అక్బర్ భాషా కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.

మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై స్పందించిన జగన్
ఇదిలా ఉంటే మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తో మాట్లాడిన ఆయన ఈ సంఘటనపై దర్యాప్తు చేయించాలని వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్ లకు ఆదేశించారు. అంతేకాక వారంలోగా మైదుకూరు గ్రామీణ సిఐపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వివాదాస్పద భూమికి సంబంధించి వారం రోజుల్లో కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

అక్బర్ బాషా సెల్ఫీ వీడియోతో భూ కబ్జా కేసుపై స్పందించిన కడప ఎస్పీ
అక్బర్ బాషా సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న కడప ఎస్పీ అన్బురాజన్ అక్బర్ బాషా కుటుంబాన్ని తమ వద్దకు పిలిపించి, బాధిత కుటుంబంతో పాటుగా వైసీపీ నాయకులతో ఈ వ్యవహారంపై విచారణ జరిపారు. అక్బర్ బాషా సెల్ఫీ వీడియో పై తాము స్పందించామని, బాధితుడి ఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈనెల 9వ తేదీన అక్బర్ బాషా స్పందన కార్యక్రమంలో కూడా పిటిషన్ ఇచ్చారని వెల్లడించారు. సిఐ వ్యవహారంపై విచారణ కు అదనపు ఎస్పీ దేవ ప్రసాద్ నియమించామని తెలిపారు. ప్రస్తుతం రెండు రోజుల పాటు సిఐ కొండా రెడ్డిని విధుల నుంచి తప్పించామని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ వెల్లడించారు. ఇదే సమయంలో ఈ భూ వివాదాన్ని పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలు ఇచ్చిందని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.

వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారన్న బాధితుడు
ఇక ఈ కేసులో వారం రోజుల్లో తమ సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ చెప్పారని బాధిత కుటుంబం చెప్తోంది. సిఐ కొండారెడ్డి తీరుతో తీవ్ర మనస్థాపానికి గురి అయ్యామని, ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని వెల్లడించిన అక్బర్ బాషా, సీఎం కార్యాలయం నుండి ఎస్పీ కార్యాలయానికి ఫోన్ వచ్చిందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ చెప్పారని పేర్కొన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications