Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌కు ఓ ఛాన్స్, తొందరపడి ఎన్టీఆర్‌కు హీరో పాత్ర: బాబుపై మాజీ సీఎం తీవ్రంగా..

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సొంత మామను ముఖ్యమంత్రి పదవి నుంచి తన్ని తగిలేయడం జగజ్జంత్రీలకే సాధ్యమని, మామూలు మనుషులకు సాధ్యం కాదని, చంద్రబాబు ఆ కోవలో వ్యక్తి కాబట్టే సులభంగా రామారావు గోచీ లాగి పడేశారని వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికాడని, తానే లాయర్‍‌ను అయితే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడినని, ఏ సమస్య వచ్చినా ఎవరో ఒకరిని పట్టేసి తాత్కాలికంగా తప్పుకునే సామర్థ్యం బాబుకు ఉందని, అందుకే ఆయన జగజ్జంత్రీలకే జగజ్జంత్రి అన్నారు.

కేసీఆర్‌కు 70, బాబుకు 0

కేసీఆర్‌కు 70, బాబుకు 0

పాలనలో తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌కు 70 మార్కులు వేస్తానని, చంద్రబాబుకు మాత్రం జీరో అన్నారు. చంద్రబాబు పాలన గురించి మాట్లాడేంత తెలివి తక్కువ వాడిని తాను కాదని నాదెండ్ల అన్నారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖలు ఇచ్చాడని చెప్పారు. కానీ ఏపీ శాసన సభలో విభజనకు అనుకూలంగాను, వ్యతిరేకంగానూ కూడా మాట్లాడలేదన్నారు. విభజన అంశం తన చేతిలో పెడితే పరిష్కారం చూపిస్తానన్న చంద్రబాబు.. విభజన తీర్మానంపై స్పీకర్ రెండు మూడుసార్లు పిలిస్తే రాకుండా దాక్కున్నారన్నారు.

ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు..

ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు..

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికాడని నాదెండ్ల అన్నారు. తాను లాయర్‌ను అయి ఉంటే.. ఇలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడినని అన్నారు. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్న కేసీఆర్ ఆ తర్వాత తగ్గారని, అందుకు కారణం ఇరువురు స్నేహితులు కావడమే అన్నారు. వారి మధ్య రాజీ కుదిరిందన్నారు. చంద్రబాబు ఎప్పటికి అప్పుడు ఎవరో ఒకర్ని పట్టేసి సమస్య నుంచి బయటపడతారన్నారు.

జగన్ పైన అభిమానం.. ఒక్క ఛాన్స్..

జగన్ పైన అభిమానం.. ఒక్క ఛాన్స్..

తెలంగాణలో విపక్షాలు సరిగా పని చేయడం లేదని నాదెండ్ల అన్నారు. అదే ఏపీలో ప్రతిపక్ష వైసిపి బాగా పని చేస్తోందన్నారు. జనంలో కూడా జగన్ పట్ల అభిమానం ఉందన్నారు. ఒక్క ఛాన్స్ ఇద్దామనే అభిప్రాయం జనాల్లో ఉందని, ఇది నేను స్వయంగా తెలుసుకున్నానని చెప్పారు.

తొందరపడి ఎన్టీఆర్‌కు కథానాయకుడి పాత్ర ఇచ్చా..

తొందరపడి ఎన్టీఆర్‌కు కథానాయకుడి పాత్ర ఇచ్చా..

టిడిపి ఆవిర్భావంపై మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఏమిటి, ఆ ఆలోచన తనదేనని నాదెండ్ల అన్నారు. ఓ సమయంలో ఎన్టీఆర్ కూడా ఈ విషయం చెప్పారని అన్నారు. కథానాయకుడిని తాను అని, తొందరపడి ఆయనకు ఆ పాత్ర ఇచ్చానని చెప్పారు. ఎన్టీఆర్‌ను పార్టీ ప్రెసిడెంటుగా ఆ రోజు చాలామంది ఒప్పుకోలేదని, కానీ ఒప్పించామని చెప్పారు.

చంద్రబాబు సక్సెస్

చంద్రబాబు సక్సెస్

చంద్రబాబు.. ఎన్టీఆర్ ఇంట్లో తిన్నాడని, ఆ ఇంట్లో వాసాలు లెక్కపెట్టాడని, దగ్గర నుంచి లాగిపడేయడం సులభమని నాదెండ్ల అన్నారు. దూరంగా ఉన్నా తాను ఎలా పడగొట్టగలనని అన్నారు. ఇంకా చెప్పాలంటే తన గోచీనే వాళ్లు లాగి పడేశారన్నారు. రామారావును వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అని, తాను ఎప్పుడూ అలా చేయలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+