• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క దెబ్బకు మైండ్ బ్లాంక్ అవ్వాలా??

|
Google Oneindia TeluguNews

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అంటే ఒకప్పుడు ఉన్న పేరు వేరు.. ఇప్పుడున్న పేరు వేరు. అభిమానుల చెంప చెళ్లుమనిపిస్తాడని, ఫోన్స్ విసిరికొడతాడని... ఇలా రకరకాలుగా వార్తలు వినిపించేవి. మరికొందరు ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెబుతున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినప్పటికీ బాలకృష్ణ జీవితాన్ని రెండుగా విభజించాలి. 'అన్‌స్టాపబుల్' కు ముందు బాలకృష్ణ, 'అన్‌స్టాపబుల్' తర్వాత బాలకృష్ణ అని చెప్పాలి'

స్లోగన్ గా మారిన 'జై బాలయ్య'

స్లోగన్ గా మారిన 'జై బాలయ్య'


దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ స్లోగన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ పేరు వినిపించగానే అందరి థింకింగ్ మారిపోతోంది. 'అన్‌స్టాపబుల్' కే కాకుండా ఇటీవలి కాలంలో చేస్తున్న సినిమాల విషయంలో మేకప్ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన చిన్న కుమార్తె దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం 'జై బాలయ్య' అనేది ఓ స్లోగన్ అయింది. 'ఆహా'లో ఈ టాక్ షో ప్రారంభించిన దగ్గరనుంచి బాలకృష్ణపై ఉన్న నెగెటివ్ థింకింగ్ తగ్గిపోయి పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతోంది.

కొత్త రికార్డులు సృష్టిస్తోన్న ‘అన్‌స్టాపబుల్'

కొత్త రికార్డులు సృష్టిస్తోన్న ‘అన్‌స్టాపబుల్'


ఒకరకంగా ఈ కార్యక్రమం అటు అల్లు అరవింద్ కు, ఇటు బాలకృష్ణకు వరప్రదాయినిగా మారింది. ఈ టాక్ షో చూస్తున్నవాళ్లు ఇన్నిరోజులు తామ విన్న బాలకృష్ణ, తాము చూసిన బాలకృష్ణ ఇతనేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎనర్జీ లెవల్స్, మాటతీరు, స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడం, చిన్న, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా, అంతరాలు గ్యాప్ లేకుండా స్నేహపూర్వకంగా, చనువుగా వ్యవహరించడం చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారంటే ఇతరుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 'అన్‌స్టాపబుల్'షో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోందంటే బాలయ్య చేస్తున్న మ్యాజిక్ అర్థం చేసుకోవచ్చు.

యువతలో ఫాలోయింగ్ బాలకృష్ణ ఒక్కరే..

యువతలో ఫాలోయింగ్ బాలకృష్ణ ఒక్కరే..


బాలకృష్ణతోపాటు చిరంజీవి, నాగార్జు. వెంకటేష్ ఒక తరం కథానాయకులు, ప్రస్తుతం వారు కూడా సినిమాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం యువతలో ఫాలోయింగ్ సంపాదించుకుంది బాలకృష్ణ ఒక్కరే అంటే ఆశ్చర్యమేస్తుంది. 'అన్‌స్టాపబుల్'కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. 'అన్‌స్టాపబుల్' టాక్ షో కు ముందుగా బాలయ్య బయట ఫంక్షన్స్ లో మాట్లాడింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు కుర్ర హీరోల సినిమాలను ప్రమోట్ చేసే బాధ్యత బాలకృష్ణపై పడింది.
'ఊర్వశివో రాక్షసివో'ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే 'దాస్ కా దమ్కీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి కూడా గెస్ట్‌గా వచ్చి సందడి సందడి చేశారు. పంచ్ ల మీద పంచ్ లు వేశారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పిలిచిన ప్రతి ఒక్కరి సినిమా ఈవెంట్లకు బాలయ్య హాజరవుతూ ఒకవైపు తన అభిమానులను, మరోవైపు కుర్ర హీరోల అభిమానులను ఆకర్షించేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణపై ఉన్న పాజిటివ్ వేవ్ రానున్న అతని సినిమాల కలెక్షన్స్ ను కుడా ప్రభావితం చేయబోతోంది. అఖండ తర్వాత ఎక్కువ గ్యాప్ తో విడుదలవుతోన్న వీరసింహారెడ్డి సినిమాపై తెలుగు ప్రేక్షుల్లో భారీగా అంచనాలున్నాయి.

English summary
The protagonist Nandamuri Balakrishna's name is different now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X