వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"శ్రీ చైతన్య" ఆరోపణలపై "నారాయణ" ఎదురుదాడి...ఒప్పందం ప్రకారమే ప్రచారం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విద్యార్థుల ర్యాంకుల ప్రకటనల విషయమై తమ సంస్థను ఉద్దేశించి శ్రీ చైతన్య చేసిన ఆరోపణలను నారాయణ సంస్థ తిప్పికొట్టింది. నారాయణ సంస్థలపై శ్రీచైతన్య ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని నారాయణ విద్యాసంస్తల డైరెక్టర్ సింధూర మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య సంస్థ అధినేత డాక్టర్ బిఎస్ రావు తమ సంస్థకు వచ్చిన ర్యాంకులను కూడా నారాయణ విద్యాసంస్థ వారికి వచ్చిన ర్యాంకులుగా చూపిచ్చుకుంటోందటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రతిస్పందించిన నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర శ్రీ చైతన్య సంస్థ గురించి మాట్లాడుతూ వాళ్లు తమ చుట్టూ తిరిగి బ్రతిమలాడి కామన్ బ్యాచ్ పెట్టించి, తీరా ఫలితాలు వచ్చేసరికి వారి ఒక్క సంస్థకే చెందిన రిజల్ట్స్ లా ర్యాంకులను ప్రకటించుకున్నారని, తామెప్పుడూ అలాంటి పనులు చేయలేదని విమర్శించారు.

శ్రీ చైతన్య... ఆరోపణలు

శ్రీ చైతన్య... ఆరోపణలు

విజయవాడ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ విద్యాసంస్తలపై శ్రీచైతన్య విద్యాసంస్థల అధిపతి డాక్టర్ బిఎస్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ ఉమ్మడి సంస్థ చైనా బ్యాచ్ గతంలోనే రద్దయిపోయిందని, ఆ విషయాన్ని తాను పలు సార్లు పెద్దల సమక్షంలో, మీడియా సముఖంగా కూడా చెప్పానని, అయినా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి శ్రీచైతన్యలో చదివిన విద్యార్థులకు వచ్చిన ర్యాంకులు తమ విద్యార్థులుగా వచ్చిన ర్యాంకులుగా నారాయణ విద్యాసంస్థ చెప్పుకుంటోందని, అది చాలా తప్పని ఆయన ఆరోపించారు. జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ లో టాప్ 5 ర్యాంకుల తమవేనని శ్రీచైతన్య అధినేత బీవీ రావు స్పష్టం చేశారు. నారాయణ అసలు దేశంలోనే లేని ర్యాంకులను వారి విద్యార్థులకు వచ్చినట్లుగా ప్రకటనలు ఇస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను నారాయణ సంస్త తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ విధంగా నారాయణ విద్యాసంస్థ చిల్లర పనులు చేస్తోందని బీఎస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తమకు నచ్చలేదని, అందుకే సంయుక్త సంస్థ అయిన శార్వాణీ కింద ఇకపై చైనా బ్యాచ్ లు ఉండవని తేల్చి చెప్పేశారు.

ఆరోపణలపై

ఆరోపణలపై "నారాయణ"...ప్రతిస్పందన

అయితే శ్రీ చైతన్య సంస్థ తమ నారాయణ సంస్థలపై చేసిన ఆరోపణలకు నారాయణ సంస్థల డైరెక్టర్ సింధూర ఘాటుగా స్పందించారు. అసలు శ్రీ చైతన్య సంస్థ తమ చుట్టూ తిరిగి బ్రతిమలాడి కామన్ సంస్థ శార్వాణీని ఏర్పాటు చేయించిందని, ఆ సంస్థ కోసం తాము టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులను తరలించామని ఇలా దేశంలో ఎక్కడా జరగదని, అయినా తాము మాత్రమే చేశామని, అది తమ నిజాయితీ అన్నారు. ఆ సంస్థ తరుపున కామన్ గా వచ్చిన రిజల్ట్ ను తాము కంబైన్ గానే వేశామని, ఇంకా శ్రీ చైతన్య సంస్థే అందరినీ తప్పుదోవ పట్టించేవిధంగా కామన్ రిజల్ట్ ను వారి విద్యాసంస్థల రిజల్ట్ లా విడిగా వేసుకున్నారని ఆరోపించారు.

మోరల్ గా...ఎథికల్ గా...నారాయణ

మోరల్ గా...ఎథికల్ గా...నారాయణ

తాము ఒప్పందానికి కట్టుబడి తమ సంస్థ లో ఫస్టియర్ లో టాప్ ర్యాంక్ వచ్చిన వారిని ఆ ఉమ్మడి బ్యాచ్ కు తరలించామని, 1, 7,8,9 ర్యాంకులు వచ్చిన వారిని చైనా బ్యాచ్ కు పంపించామని, ఎంతో మోరల్ గా, ఎథికల్ గా ప్రవర్తించామని నారాయణ సంస్థల డైరెక్టర్ సింధూర చెప్పారు. అలాంటిది రిజల్ట్ రాగానే వారిని మీ విద్యార్థులుగా ప్రకటించుకుంటూ మమ్మల్ని అంటున్నారా అంటూ సింధూర ప్రశ్నించారు. తాము అగ్రిమెంట్ లో రూల్స్ ను 100 పర్సెంట్ ఫాలో అయ్యామన్నారు.
కామన్ వేయాలనుకున్న నిబంధనను అనుపరించి ర్యాంకులను కామన్ బ్యానర్ మీదే ప్రకటించామని, కానీ శ్రీ చైతన్యనే మొదట విడిగా ర్యాంకులని ప్రకటించిందని ఆరోపించారు.

ఆ అవసరం లేదు...

ఆ అవసరం లేదు..."నారాయణ" డైరెక్టర్

తమ చుట్టూ తిరిగి కామన్ బ్యాచ్ పెట్టించి తమ మెరిట్ స్టూడెంట్స్ అందరినీ కామన్ బ్యాచ్ కు తరలించేలా చేయించి చివరకు శ్రీ చైతన్య తమనే తప్పుపడుతోందని నారాయణా విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎక్కడో చదివిన పిల్లల రిజల్ట్ ను తమ సంస్థ రిజల్ట్స్ గా వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అందులో శ్రీ చెతన్య సంస్థ రిజల్ట్స్ తమకు అసలు అవసరం లేదన్నారు. విద్యార్థుల ర్యాంకుల విషయమై శ్రీ చైతన్య, నారాయణ సంస్థల మధ్య రగిలిన వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

English summary
Narayana Institute responded to allegations made by Sri Chaitanya on their educational institutions. Narayana directore made it clear that they have given advertisements based on agreement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X