జగన్ కు రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపదీ ముర్ము ఫోన్ - మద్దతిచ్చినందుకు థ్యాంక్స్
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున అభ్యర్ధిగా ఎంపికైన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము ప్రస్తుతం తనకు మద్దతిస్తున్న రాజకీయ పక్షాల నేతలకు ఫోన్లు చేస్తున్నారు. వారి నుంచి మద్దతు కోరుతున్నారు. తనకు ఇప్పటికే మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కూడా ఇవాళ ఫోన్ చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తన మద్దతును ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పటికే ద్రౌపదీ ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ వైసీపీ నేతల్ని పంపాపరు. ఈ క్రమంలో ముర్ము నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు సంతకాలు చేశారు.

ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన ముర్ము... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం జగన్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌పై వారి మధ్య చర్చ జరిగిన్నట్లు సమాచారం. అంతేకాకుండా తనకు మద్దతు ప్రకటించిన జగన్‌కు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెల 4వ తేదిన ముర్ము ఏపీకి రానున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీకి అదే రోజు రానున్నారు. కానీ ఆరోజు జగన్ పారిస్ పర్యటనలో ఉండబోతున్నారు. అందుకే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications