లోకేష్ పాదయాత్ర మొదలవుతుందా ? జగన్ సర్కార్ మైండ్ గేమ్ !

ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ నెల 27 నుంచి చేపట్టదలచిన యువగళం పాదయాత్రకు అనుమతి కోరుతూ ఎస్పీ నుంచి హోం సెక్రటరీ వరకూ టీడీపీ వినతులు చేసినా ఇంకా అనుమతి మాత్రం రాలేదు. అయితే అనుమతి ఇవ్వడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం వైసీపీ నేతలు, పోలీసులు మాత్రం ఖండిస్తున్నారు. అలాగని అనుమతి ఇస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ మైండ్ గేమ్ ఆడుతోందా అన్న చర్చ జరుగుతోంది.

 లోకేష్ పాదయాత్రకు అనుమతి

లోకేష్ పాదయాత్రకు అనుమతి

ఏపీలో నారా లోకేష్ చేపట్టే పాదయాత్రకు వైసీపీ సర్కార్ అనుమతి మంజూరు చేసే విషయంలో తాత్సారం చేస్తోంది. జిల్లా స్ధాయిలో ఉండే ఎస్పీ స్ధాయి అధికారి నుంచి డీజీపీ, హోంశాఖ కార్యదర్శి వరకూ టీడీపీ అనుమతి కోసం లేఖలు రాసింది. వీటిపై రోజూ సదరు అధికారుల్ని సంప్రదిస్తూనే ఉంది. కానీ అనుమతి విషయంలో మాత్రం వారు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్ధితి నెలకొంది. దీనికి కారణం ప్రభుత్వం నుంచి క్లారిటీ లేకపోవడమే. అలాగని తొందరపడి ఏ పోలీసు అధికారి అయినా ఇతర శాఖల అధికారులు అయినా నిర్ణయం తీసుకుంటే సర్కార్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో అంతా మౌనం వహిస్తున్నారు.

అనుమతికి టీడీపీ పోరాటం

అనుమతికి టీడీపీ పోరాటం

లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ అధికారులకు వరుసగా లేఖలు రాస్తూనే ఉంది. అయినా అనుమతిపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్ధితి ఉంది. అయినా టీడీపీ నేతలు ఆగడం లేదు. ప్రభుత్వాన్ని, అధికారుల్ని కలిపి టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో మీ పాదయాత్రలకు మేం అనుమతులు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఇరుకునపడుతోంది. అయితే వెంటనే స్పందించి అనుమతి ఇచ్చే పరిస్ధితి మాత్రం కనిపించడం లేదు. మరికొన్ని రోజులు ఇదే పరిస్దితి కొనసాగేలా కనిపిస్తోంది.

వైసీపీ సర్కార్ మల్లగుల్లాలు

వైసీపీ సర్కార్ మల్లగుల్లాలు

లోకేష్ పాదయాత్రకు అనుమతిచ్చే విషయంలో ప్రభుత్వ పెద్దల్లోనే క్లారిటీ లేనట్లు తెలుస్తోంది. అసలు లోకేష్ పాదయాత్రతో ఆయనకు ఎలాంటి ప్రయోజనం కలగబోతోంది, అదే సమయంలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం కలగబోతోంది, లోకేష్ పాదయాత్రలో ఆయన్ను కలిసే వారు ఎవరు, వారు గతంలో ప్రభుత్వ బాధితులైతే వచ్చే ఎన్నికల్లో ఏ మేరకు వారు వైసీపీ అవకాశాలను దెబ్బతీయబోతున్నారు, ఇలాంటి పలు వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిని విశ్లేషించి లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్న విషయాన్ని తేల్చబోతోంది.

వైసీపీ మైండ్ గేమ్ ఇలా..?

వైసీపీ మైండ్ గేమ్ ఇలా..?

లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడుతుండటం, ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంపై టీడీపీ నేతలు జనంలోకి వెళ్లి ఇదే విషయాన్ని ప్రచారం చేస్తుండటం, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తుండటంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడుతోంది. దీంతో పాదయాత్రకు అనుమతి ఇవ్వట్లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఓవైపు పార్టీ నేతల సాయంతో, మరోవైపు పోలీసుల సాయంతో ఖండించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. మరోవైపు లోకేష్ పాదయాత్రకు అడగ్గానే అనుమతిస్తే ఎలా అనే వైఖరితోనే కావాలనే జాప్యం చేస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషం వరకూ ఒత్తిడి పెంచి ఒక్కరోజు ముందు అనుమతివ్వడం ద్వారా టీడీపీ వర్గాల్ని ఒత్తిడిలోకి నెట్టాలనే మైండ్ గేమ్ దీని వెనుక ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+