Nellimarla Assembly Election 2024 Results LIVE: నెల్లిమర్లలో జనసేన జెండా ఎగిరేనా ?

నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పోటీ వైసీపీ, జనసేన అభ్యర్ధుల మధ్యే జరిగింది. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, కూటమి తరఫున జనసేన అభ్యర్ధి లోకం మాధవి బరిలోకి దిగారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల తరహాలోనే ఇక్కడా వైసీపీ, కూటమి మధ్య ముఖాముఖీ పోరు సాగింది. ఇందులో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

విజయనగరం జిల్లాలోని రూరల్ నియోజకవర్గాల్లో ఒకటైన నెల్లిమర్ల అసెంబ్లీ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుపై జనసేన మహిళా అభ్యర్ధి లోకం మాధవిని బరిలోకి దింపింది. ఐదేళ్లుగా నెల్లిమర్లలో చురుగ్గా పనిచేసిన లోకం మాధవికి జనసేన తొలి జాబితాలోనే టికెట్ ఇచ్చింది.

AP assembly election results nellimarla Assembly Election 2024 Results voting counting live updates news in telugu

పారిశ్రామికవేత్త అయిన లోకం మాధవికి జనసేన బలంతో పాటు టీడీపీ ఓటు బ్యాంక్ కూడా కలిసి వచ్చాయని పోలింగ్ సరళి చెబుతోంది. అయితే విజయనగరం జిల్లాపై వైసీపీకి ఉన్న పట్టు, ముఖ్యంగా బొత్స కుటుంబ ప్రభావం ఆ పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

నెల్లిమర్లలో 2009లో, 2019లో గెలిచిన బడ్డుకొండ అప్పలనాయుడు పూర్తిగా వైసీపీ సంక్షేమ పథకాలు, బొత్స రాజకీయాన్ని నమ్ముకుని బరిలోకి దిగారు. అటు లోకం మాధవి మహిళా అభ్యర్ధి కావడం, ఆరోపణలు లేకపోవడం, తొలిసారి పోటీ చేయడం వంటి విభిన్న కారణాలు ఇక్కడ పోటీని రసవత్తరంగా మార్చాయి. జిల్లాలో పరిస్ధితులు వైసీపీకి అనుకూలంగా ఉండటం అప్పలనాయుడికి కలిసి వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కూటమి ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం లోకం మాధవికి అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు. లేకపోతే మాత్రం అప్పలనాయుడు మరోసారి ఎమ్మెల్యే కావడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+