త్వరలోనే వారి ఖాతాల్లో 25వేలు జమ..తీపికబురు చెప్పిన మంత్రి సవిత!

అర్హులైన ప్రతీ ఒక్క నేత కార్మికుడికి నేతన్న సేవలో పథకం అందుతుందని, ఎవరూ వైసీపీ ట్రాప్ లో పడొద్దు అని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. నేతన్న సేవలో పథకం విషయంలో నేతన్నలకు అన్ని వివరాలు చెప్పి, త్వరలో ఈ పథకం అందని అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం అందిస్తామని, వారి ఖాతాలో 25 వేల రూపాయలు వేస్తామని చెప్పారు.

SIR పై వైసీపీ ఫీడ్ బ్యాక్ ఇదే- పార్టీ నేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు..!
SIR పై వైసీపీ ఫీడ్ బ్యాక్ ఇదే- పార్టీ నేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు..!

మగ్గం నేసే ప్రతి అర్హులైన నేతన్నకూ నేతన్న సేవలో అందుతుంది: మంత్రి సవిత

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మగ్గం నేసే ప్రతి అర్హులైన నేతన్నకూ నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ నెలాఖరు వరకు రెండో విడత లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం జరుగుతోందని, అది పూర్తికాగానే అర్హుల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేలు జమ చేస్తామని తెలిపారు.

Nethanna Sevalo Minister Savitha Assures Every Eligible Weaver Will Get Nethanna Sevalo Benefits rs 25k in their accounts soon

నేతన్నలు వారి ట్రాప్‌లో పడొద్దని పిలుపు

మొదటి విడతలో 71,536మందికి ఇప్పటికే సాయం అందించామని, కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా నేతన్నల కళ్లలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వైసీపీ ఈ పథకంపై అపోహలు సృష్టిస్తోందని, నేతన్నలు వారి ట్రాప్‌లో పడొద్దని పిలుపునిచ్చారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, నేతన్నలకు 365రోజులపాటు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు.

 స్థానిక సంస్థల వేళ కూటమి బిగ్ ట్విస్ట్, వైసీపీ వాట్ నెక్స్ట్..!!
స్థానిక సంస్థల వేళ కూటమి బిగ్ ట్విస్ట్, వైసీపీ వాట్ నెక్స్ట్..!!

చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్

2014-19 కాలంలో మొట్టమొదటిసారి 50 ఏళ్లు నిండిన చేనేతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రారంభించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. ప్రస్తుతం 86 వేల మందికి పెన్షన్ అందుతోంది. ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గం నేసే వారికి 200 యూనిట్లు, మర మగ్గం వారికి 500 యూనిట్లు అందిస్తూ 51,952 మంది లబ్ధి పొందుతున్నారన్నారు.

నేతన్నల కోసం ప్రభుత్వం చేస్తుందిదే

మెగా క్లస్టర్లు, టెక్స్‌టైల్స్ పార్కులు, రెడీమేడ్ దుస్తుల శిక్షణ, త్రిఫ్ట్ ఫండ్, 90 శాతం రాయితీతో పనిముట్లు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని, ధర్మవరంలో రూ.38 కోట్ల మెగా క్లస్టర్, మంగళగిరిలో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+