9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ భేటీ-16న బడ్జెట్ సమర్పణ-అచ్చెన్న ది గ్రేట్ అన్న జగన్ ..
ఇవాళ సమావేశమైన ఏపీ అసెంబ్లీ బీఏసీ.. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీల్ని, అజెండాను నిర్ణయించింది.
అమరావతి : ఏపీలో ఈసారి 9 రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ వాయిదా పడ్డాక స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ సమావేశమైంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉదయం 11.54 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశానికి సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి, శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, శాసనసభ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, శాసనసభ వ్యవహారాల సమన్వయ కర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి, శాసనసభలో ఉప ప్రతిపక్ష నేత అచ్చెన్నాయుడు
పాల్గొన్నారు.

బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ ఉపనేత అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యచేశారు. అచ్చెన్నను చూడగానే వైఎస్ జగన్ అచ్చెన్న ది గ్రేట్ అంటూ పలకరించారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైంది. అనంతరం 9 రోజుల పాటు సభ జరపాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 19న ఆదివారం, 22న ఉగాది సెలవు ఇవ్వనున్నారు. ఈ నెల 24తో సమావేశాలు ముగియనున్నాయి. మరోవైపు ఆదివారం అసెంబ్లీ పెట్టి ఉగాదితో పాటు మరో రోజు సెలవు ఇవ్వాలని అచ్చెన్న కోరారు. అయితే ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో 10 నిమిషాల్లోనే భేటీ ముగిసింది.
బీఏసీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని, సీఎం జగన్, టీడీపీనేత అచ్చెన్నాయుడు..!!#BACMeeting #YSJagan #Atchannaidu #TammineniSitharam #ApBudgetSession2023 #ApBudgetSessions #Oneindiatelugu pic.twitter.com/yk2cIBCYS4
— oneindiatelugu (@oneindiatelugu) March 14, 2023
అనంతరం సీఎం జగన్ తో పాటు మంత్రులు కేబినెట్ భేటీకి వెళ్లారు. 45అంశాలపై ఇవాళ కేబినెట్ లో చర్చించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 20బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇండస్ట్రియల్ పాలసి 2023-27 కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకు 6 వేల జీతం ఇచ్చేలా నైట్ వాచ్ మెన్ ల నియామకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే మరికొన్ని కీలక అంశాలపై బిల్లులకూ కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications