వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని అమరావతి గ్రామాల్లో నో ఎలక్షన్స్ .... ఎవరి రీజన్ వారిదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కానీ రాజధాని అమరావతి గ్రామాల్లో మాత్రం ఎన్నికలు జరగటం లేదు. అందుకు ఎవరి కారణాలు వారు చెప్తున్నారు. ప్రభుత్వం రాజధాని అమరావతి గ్రామాల ప్రజలు తమకు ఓట్లు వెయ్యరనే భయంతో ఎన్నికలు జరపటం లేదని అమరావతి గ్రామాల ప్రజలు చెప్తుంటే, ఇటీవల పలు గ్రామాలను విలీనం చెయ్యటంతో అక్కడ ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమీషన్ ను కోరింది ఏపీ ప్రభుత్వం .

స్థానిక సంస్థల ఎన్నికలు .. ఆ పని చేస్తే అదిరిపోయే ఆఫర్ అంటున్న వైసీపీ సర్కార్స్థానిక సంస్థల ఎన్నికలు .. ఆ పని చేస్తే అదిరిపోయే ఆఫర్ అంటున్న వైసీపీ సర్కార్

రాజధాని గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని కోరుతున్న సర్కార్

రాజధాని గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని కోరుతున్న సర్కార్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఇటీవల విలీనం చేసిన గ్రామాలలో ఎన్నికలు నిర్వహించరాదని లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించని గ్రామ పంచాయతీల వివరాలను జిల్లాల వారీగా లేఖలో ప్రభుత్వం తరపున ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మునిసిపాలిటీలు, కార్పొరేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పలు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం విలీనం చెయ్యటంతో అలాంటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్ ను ఈ లేఖలో కోరారు.

ఎన్నికల కమీషన్ కు లేఖ రాసిన గోపాలకృష్ణ ద్వివేది

ఎన్నికల కమీషన్ కు లేఖ రాసిన గోపాలకృష్ణ ద్వివేది

అమరావతి పరిధిలోని గ్రామాల్లో పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేయమని సదరు లేఖలో కోరారు. అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందున ఆయా గ్రామాల్లో పంచాయతీ, ఎంపిటిసి, జడ్పీటీసిలకు ఎన్నికలు నిర్వహించారాదని ఎన్నికల కమిషన్ ను కోరారు. ప్రభుత్వం అమరావతి గ్రామాలలో ఎన్నికలు నిర్వహించకూడదని భావిస్తున్న నేపధ్యంలో రాజధాని అమరావతి గ్రామాల ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

విలీన గ్రామాల్లో, అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యనున్న కారణంగా ఎన్నికలు ఆపాలని విజ్ఞప్తి

విలీన గ్రామాల్లో, అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యనున్న కారణంగా ఎన్నికలు ఆపాలని విజ్ఞప్తి

రాజధాని ఉద్యమం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిపివేసింది. నరససరావుపేట, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల ఉన్నతాధికారుల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు పంపించింది. అటు అమరావతి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయటం, తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిలిపివేయాలని లేఖలో కోరటంతో రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి గ్రామాల్లో ఎన్నికలు నో

ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి గ్రామాల్లో ఎన్నికలు నో

రాజధాని పరిధిలోని యర్రబాలెం, బేతపూడి, నవులూరు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో, పెనుమాక, ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. అలాగే నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండతో పాటు తుళ్లూరు మండలంలోని గ్రామాలను కలిపి అమరావతి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంతో అమరావతి గ్రామాలు స్థానిక ఎన్నికలకు పూర్తిగా దూరం కానున్నాయి.

Recommended Video

Election Commissioner Ramesh Kumar Comments On Local Body Elections | Oneindia Telugu
ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయం అని అంటున్న రాజధాని ప్రజలు

ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయం అని అంటున్న రాజధాని ప్రజలు

ఇక రాజధాని అమరావతిలో ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఉన్న హైకోర్టులో ఉన్న కేసులు, వ్యాజ్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం ఎన్నికల కమీషన్ ను విజ్ఞప్తి చేసింది. ఇక రాజధాని గ్రామాల ప్రజలు అధికార వైసీపీ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కారణంగా ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదన్న భయంతో వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

English summary
Elections for local bodies will be held in AP. But in Amaravati villages of the capital, elections are not held. Whose reasons are they claiming. If the people of Amaravati villages say that they are not going to hold polls for fear of voting, the AP government has asked the Election Commission not to conduct elections recent merger of several villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X