Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతికి పని చేస్తాం కానీ....? తేల్చేసిన సింగపూర్ మంత్రి..!

ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో పాలు పంచుకునేందుకు గతంలో సింగపూర్ ముందుకొచ్చింది. అక్కడి ప్రభుత్వంతో పాటు బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారి అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభం కాగానే సింగపూర్ ఒప్పందాలు కూడా రద్దయిపోయాయి.

ఈ నేపథ్యంలో మరోసారి సింగపూర్ కన్సార్టియంను అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో నేరుగా సీఎం చంద్రబాబు ఆ దేశానికి వెళ్లి లాబీయింగ్ ప్రారంభించారు. అక్కడి మంత్రి టాన్ సీ లెంగ్ తో భేటీ అయ్యారు. మళ్లీ అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. అయితే మరోసారి అమరావతి రాజధానికి పని చేసేందుకు సింగపూర్ మంత్రి నో చెప్పేశారు.

not work for amaravati capital but only for housing projects clarified singapore minister

చంద్రబాబుతో భేటీ పై సింగపూర్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కూడా తెలిపారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ , నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.

not work for amaravati capital but only for housing projects clarified singapore minister

అయితే 2014-2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పని చేశామని, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తెలిపారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారాక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్టియం బయటకు వచ్చేసిందన్నారు. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సార్టియం పని చేయకున్నా..అమరావతిలో, ఏపీలో పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ది ప్రణాళికల్లో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+