వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్నవరం ఎయిర్ పోర్టులో మరో టెన్షన్-జగన్ రిటర్న్-కాసేపట్లో పవన్ -జనసైనికుల ఎంట్రీ..

|
Google Oneindia TeluguNews

విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రుల రిటర్న్, పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో జనసైనికులు సృష్టించిన హంగామా మరవకముందే ఇవాళ గన్నవరం ఎయిర్ పోర్టులో మరోసారి అలాంటి పరిస్ధితి తలెత్తేలా కనిపించింది. దీనికి కారణం సీఎం జగన్, పవన్ కళ్యాణ్ దాదాపు గంట వ్యవధిలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోవడమే.

ఇవాళ నంద్యాల జిల్లా టూర్ కు వెళ్లిన సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టుకు తిరిగివచ్చారు. దీంతో పోలీసులు గంట ముందు నుంచీ అక్కడ పహారా కాశారు. అసలే వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రుల కార్లను జనసైనికులు లక్ష్యంగా చేసుకున్న ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. మంత్రులకు కూడా భద్రత కల్పించలేరా అంటూ ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఇవాళ గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద సీఎం జగన్ రాక సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

now tension shifts to vizag airport to gannavaram as ys jagan, pawan kalyan arrivals now

అయితే సీఎం జగన్ యథావిథిగా నంద్యాల టూర్ నుంచి తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు రావడం, అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. అదే సమయంలో అక్కడికి పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూస్తున్న జనసైనికులు సీఎం కాన్వాయ్ ను టార్గెట్ చేసే అవకాశం ఉందన్న సంకేతాలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. చివరికి జనసైనికుల్ని సీఎం కాన్వాయ్ కు దూరంగా పంపించేశారు. దీంతో జగన్ సజావుగా వెళ్లిపోయారు. కాసేపట్లో విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకోనున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు జనసైనికులు ఎదురుచూస్తున్నారు. అయితే విశాఖ ఘటనల దృష్టా జనసైనికులపై పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు.

English summary
after vizag airport incidents, now tension shifted to gannavaram airport with ys jagan and pawan kalyan's arrivals at almost same time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X