వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి ప్రత్యేక హోదా నో అని తేల్చి పారేసిన కేంద్రం .... జగన్ సైలెన్స్ కి అర్ధం ఏంటి ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టి పారదర్శక పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారనే భావన ఏపీ ప్రజల్లో ఉన్నా ఆ ఆశలపైన కేంద్రం అడుగడుగునా నీళ్ళు చల్లుతూనే ఉంది . ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలో తన మొండితనాన్ని విడిచి పెట్టేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు మోడీ సర్కార్. విభజన నేపథ్యంలో ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వలేనని కేంద్రం మరోసారి క్లియర్ గా చెప్పేసింది.

పరిటాల కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇస్తూ చంద్రబాబు ప్రకటన .. రీజన్ ఇదేపరిటాల కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇస్తూ చంద్రబాబు ప్రకటన .. రీజన్ ఇదే

Recommended Video

ఢిల్లీ లో ఏపీ భవన్ ప్రత్యేక ప్రతినిధి మళ్ళీ విజయ సాయి రెడ్డే
హోదా విషయంలో సైలెంట్ అయిన వైసీపీ

హోదా విషయంలో సైలెంట్ అయిన వైసీపీ

ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ వద్ద హోదా అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు హోదాపై నోరు మెదపటం లేదు . ఇక ఎంపీలు సైతం లోక్ సభలో ప్రత్యేక హోదానే ప్రధాన అజెండాగా పోరాటం చేస్తామని చెప్పి అసలు హోదానే ఇచ్చేది లేదని తేల్చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు . ఏం చెయ్యాలో చేతకాక చేష్టలుడిగి చూస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయింది అని అడుగడుగునా విమర్శలు గుప్పించిన వైసీపీ ఇప్పుడు హోదా విషయంలో సైలెంట్ అవ్వటంతో ప్రజల్లో ఒకింత అసహనం నెలకొంది.

లిఖితపూర్వకంగా హోదా ఇచ్చేది లేదని చెప్పిన కేంద్రం

లిఖితపూర్వకంగా హోదా ఇచ్చేది లేదని చెప్పిన కేంద్రం

ఇక తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన హోదా ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చారు. చాలా క్లియర్
ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరుగునపడిందని చెప్పిన ఆయన 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేదే లేదని తేల్చిన కేంద్రం హోదాకు బదులుగా ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక సాయం ప్రకటించిన వైనాన్ని, చేసిన సాయాన్ని కేంద్రమంత్రి చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్ అయిన జగన్ ...ప్రత్యేక హోదా నో అన్న మంత్రులు

ప్రత్యేక హోదా విషయంలో సైలెంట్ అయిన జగన్ ...ప్రత్యేక హోదా నో అన్న మంత్రులు

నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు . తన వాదన బలంగా వినిపించినంత మాత్రాన ప్రత్యేక హోదా సాధ్యం కాదనే విషయం జగన్ ఎరిగిన సత్యమే ... ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా జగన్ హోదా గురించి కేంద్రానికి గుర్తుచేశారు. కానీ స్పందన లేదు. ఆ తర్వాత కేంద్రం ప్రకటనలు చేస్తున్నా జగన్ మాత్రం స్పందించిన పాపాన పోలేదు .అయితే హోదా ఇవ్వకూడదని కేంద్రం ఎంత బలంగా నిర్ణయించుకుందో అప్పట్లో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాటల్లో తేటతెల్లమైంది. ఇప్పుడు ఏకంగా రాతపూర్వకంగా ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి పారేశారు.

టీడీపీపై విమర్శలు చేసిన జగన్ , విజయసాయి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టినట్టేనా ?

టీడీపీపై విమర్శలు చేసిన జగన్ , విజయసాయి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టినట్టేనా ?

దీంతో ఏపీ ప్రజలకు, సీఎం జగన్ కు మరోమారు షాక్ తగిలింది. కేంద్రం లో అధికారంలో ఉన్న పార్టీని ఒప్పించి ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమాతో ఉన్న జగన్ కు పాలన ప్రారంభించిన తొలినాళ్ళలోనే బీజేపీ హోదా ఇచ్చేది లేదని రెండు సార్లు చాలా స్పష్టం గా చెప్పినా జగన్ మాత్రం ఇప్పటి వరకు ఎందుకు హోదా ఇవ్వరు అని నిలదీయలేదు. ప్రశ్నించలేదు. ఇక ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుని, లోకేష్ ను టార్గెట్ చేసి పొద్దుకు పది పోస్టులు పెడుతున్న విజయసాయి ఎందుకు కేంద్రం ఇంత ఖరాకండిగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తే సైలెంట్ గా ఉంటున్నారన్నది ప్రశ్న . ప్రత్యేక హోదా విషయంలో పాలక వైసీపీ తాజా వైఖరి ప్రత్యేక హోదా అంశానికి ఎండ్ కార్డ్ పడినట్టే అన్న సంకేతం ఇస్తుంది.

English summary
NDA Government ruled out any possibility of according Special Category Status to Andhra Pradesh once again.In a written reply to YCP MP Balli Durga Prasad, Union Minister of State for Home Nityananda Rai made it clear there is no question of granting Special Category Status after offering Special Package. He maintained, 'Special Category Status is a closed chapter and focus is now on other assurances of AP Organisation Act 2014. We will try to address the inter-state issues between AP and Telangana'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X